ముంబై నుంచి వచ్చి టాలీవుడ్ ను ఏలిన భామలు చాలా మంది ఉన్నారు. తమ అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. హీరోయిన్ తాప్సీ కూడా బాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చింది. మంచు మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. అంతకముందు బాలీవుడ్ లో ఈ బ్యూటీ మోడలింగ్ చేసింది. తాప్సీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించి విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది. 


Also Read: ఎయిర్ పోర్ట్ లో ఆమిర్ ఖాన్ తో చైతు.. ఫోటోలు వైరల్..


తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాన్ని ఓ అపురూపమైన ఫోటో రూపంలో ఫ్యాన్స్ కి షేర్ చేసింది. స్కూల్ లో నిర్వహించిన రన్నింగ్ రేసులో తాప్సీ ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం ఆ ఫొటోలో చూడొచ్చు. చిన్నప్పుడు చాలా వేగంగా పరిగెత్తేదాన్ని అంటూ ఆ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు, సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పటితో పోలిస్తే తాప్సీ ఇప్పుడు చాలా బిజీగా మారింది. 


ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటిస్తుంది. హీరోయిన్ కు ప్రాధాన్యం ఉన్న సినిమాలతో తాప్సీ తన నటన ప్రతిభను చాటుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తోంది. ఈ సినిమాకి 'శెభాష్ మిథు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వీటితో పాటు అమ్మడు చేతుల్లో 'రష్మీ రాకెట్', జనగణమన' వంటి సినిమాలున్నాయి. ఏడాదికి అరడజను సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది ఈ బ్యూటీ. 






Also Read: కనులకు తెలియని ఓ కలలా.. సిద్ శ్రీరామ్ మరో మెలోడీ.. సుమంత్ పాటకు మహేష్ బాబు ఫిదా!


Also Read: బుల్లితెరపై మహేష్‌తో ఎన్టీఆర్ గేమ్.. టీఆర్పీ ఆకాశాన్నంటుతుందా?


Also Read: అభిమానికి క్యాన్సర్... వీడియోకాల్ చేసి మాట్లాడిన ప్రభాస్


Also Read: హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్.. కానీ సినిమా రిలీజ్ పక్కా..