Republic Movie Release Date: హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్.. కానీ సినిమా రిలీజ్ పక్కా..

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, దేవా కట్టా కాంబినేషన్ లో 'రిపబ్లిక్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Continues below advertisement

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, దేవా కట్టా కాంబినేషన్ లో 'రిపబ్లిక్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సామాజిక అంశాలు, రాజకీయాల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో తేజు సరసన హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటించింది. అలానే రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రెండు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 

Continues below advertisement

Also Read: కనులకు తెలియని ఓ కలలా.. సిద్ శ్రీరామ్ మరో మెలోడీ.. సుమంత్ పాటకు మహేష్ బాబు ఫిదా!

పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం కొన్ని రోజుల క్రితమే అయిపోయాయి. ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉంది. ఇక ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టాలనుకున్న సమయంలో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగింది. నిజానికి ఇది పెద్ద యాక్సిడెంట్ అనే చెప్పాలి. రెండు రోజుల పాటు ధరమ్ తేజ్ స్పృహలో లేడు. వారం రోజులకు పైగా వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించాల్సి వచ్చింది. సర్జరీ కూడా చేశారు. 

ఈ క్రమంలో ఆయన నటించిన సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయరేమో అని.. వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది. సినిమా విడుదలకు పదిరోజుల ముందు హీరో హాస్పిటల్ లో ఉంటే ఇక సినిమా రిలీజ్ కష్టమనే అనుకున్నారు. పైగా ఆయన్ను ఎప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారో కూడా తెలియదు. ఒకవేళ డిశ్చార్జ్ చేసినా.. కనీసం రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకున్న సినిమా వాయిదా తప్పనిసరి అనుకున్నారు. 

కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చెప్పిన టైమ్ కే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. సెన్సార్ కూడా పూర్తి చేయించి.. అక్టోబర్ 1నే 'రిపబ్లిక్' సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను సెన్సార్ వాళ్లు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.  

Continues below advertisement