ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ హవా కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. తన అభ్యర్థులను పోటీలో నిలపలేదు. కానీ కొన్ని స్థానిక నేతల అండగా టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. మధ్యాహ్నాం వరకు ఉన్న ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతుంది. జడ్పీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా సొంతం చేసుకుంది. జడ్పీటీసీల్లో వైసీపీ మినహా ఏ పార్టీ ఖాతా తెరవలేదు. ఈ ఫలితాలు కొనసాగితే మొత్తం 641 జడ్పీటీసీ స్థానాల్లో 95 శాతానికి పైగా అధికార పార్టీకే దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రకాశం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కౌంటింగ్‌ పూర్తయిన ప్రతిచోటా వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఎంపీటీసీ ఫలితాల్లోనూ అధికార పార్టీ దూసుకుపోతుంది. టీడీపీ అధికారికంగా పోటీ చేయకపోయినా అక్కడక్కడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. మొత్తం 9859 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ 4095 వేల మార్క్ కు చేరువైంది. టీడీపీ స్కోర్‌ 286 లోపే ఉంది. 



  • విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఎంపీటీసీ 652, జడ్పీటీసీ 39 స్థానాలు : 
    ఎంపీటీసీలు : వైసీపీ 152 , టీడీపీ 12, బీజేపీ 1, ఇతరులు 6 స్థానాలు గెలుచుకున్నాయి
    జడ్పీటీసీ :  వైసీపీ 3 

  • తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీటీసీ 1086, జడ్పీటీసీ 61 స్థానాలు 
    ఎంపీటీసీ :  వైసీపీ 77, టీడీపీ 1, బీజేపీ 2, ఇతరులు 1 గెలుచుకున్నాయి
    జడ్పీటీసీ : వైసీపీ 8

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీటీసీ 863, జడ్పీటీసీ 61 స్థానాలు :
    ఎంపీటీసీ : వైసీపీ 118, టీడీపీ 5, బీజేపీ 2, ఇతరులు 5
    జడ్పీటీసీ : వైసీపీ 5 

  • కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ 723, జడ్పీటీసీ 46 స్థానాలు :
    ఎంపీటీసీ : వైసీపీ 235, టీడీపీ 9, బీజేపీ 2
    జడ్పీటీసీ : వైసీపీ 5

  • గుంటూరు జిల్లాలో ఎంపీటీసీ 805, జడ్పీటీసీ 54 స్థానాలు :
    ఎంపీటీసీ : వైసీపీ 262, టీడీపీ 5, బీజేపీ 1, ఇతరులు 5
    జడ్పీటీసీ : వైసీపీ 8

  • ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ  742 , జడ్పీటీసీ 55  స్థానాలు :
    ఎంపీటీసీ : వైసీపీ 391, టీడీపీ 29, బీజేపీ 0, ఇతరులు 5
    జడ్పీటీసీ : వైసీపీ 21

  • నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ  554 , జడ్పీటీసీ 46 స్థానాలు :
    ఎంపీటీసీ : వైసీపీ 283, టీడీపీ 8, బీజేపీ 2, ఇతరలు 5
    జడ్పీటీసీ : వైసీపీ 12 

  • చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీ 841 , జడ్పీటీసీ 65 :
    ఎంపీటీసీ : వైసీపీ 569, టీడీపీ 19, బీజేపీ 0, ఇతరులు 5
    జడ్పీటీసీ : వైసీపీ 31

  • కడప జిల్లాలో ఎంపీటీసీ  858 , జడ్పీటీసీ 50 :
    ఎంపీటీసీ : వైసీపీ 466, టీడీపీ 14, బీజేపీ 2, ఇతరులు 1
    జడ్పీటీసీ : వైసీపీ 40

  • కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ 550 , జడ్పీటీసీ 53 :
    ఎంపీటీసీ : వైసీపీ 595, టీడీపీ 80, బీజేపీ 4, ఇతరులు 10
    జడ్పీటీసీ : వైసీపీ 21

  • అనంతపురం జిల్లాలో  ఎంపీటీసీ  804 , జడ్పీటీసీ 63 :
    ఎంపీటీసీ : వైసీపీ 214, టీడీపీ 3, బీజేపీ 0
    జడ్పీటీసీ : వైసీపీ 35

  • శ్రీకాకుళం జిల్లాలో  ఎంపీటీసీ 667 , జడ్పీటీసీ 38 :
    ఎంపీటీసీ : వైసీపీ 78, టీడీపీ 1, బీజేపీ 0, ఇతరులు 2
    జడ్పీటీసీ : 

  • విజయనగరంలో  ఎంపీటీసీ  549 , జడ్పీటీసీ 34 :
    ఎంపీటీసీ : వైసీపీ 80, టీడీపీ 0, బీజేపీ 0, ఇతరులు 02
    జడ్పీటీసీ : వైసీపీ 3


Also Read: Diwedi On Counting: ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ కౌంటింగ్... ఆరు చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయి... రీపోల్ పై ఎస్ఈసీదే తుది నిర్ణయమన్న గోపాలకృష్ణ ద్వివేది