కడప పట్టణంలోని నకాశ్‌ వీధిలో దారుణం జరిగింది. తల్లి, కూతురు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడప జిల్లా కేంద్రంలోని నకాశ్‌ వీధికి చెందిన షేక్‌ హుస్సేన్, ఖుర్షీదా(47) భార్యభర్తలు. వీరికి కుమార్తె అలీమా(14), కుమారుడు జమీర్‌ ఉన్నారు. భార్యభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. కూతురు అలీమాను తల్లి ఖుర్షీదా సెల్‌ఫోన్‌ తరచూ చూస్తున్నావంటూ మందలించడంతో బుధవారం రాత్రి వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఖుర్షీదా అలీమా మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అక్కడే ఉన్న కుమారుడు జమీర్ అక్కనే చంపేస్తావా అంటూ తల్లిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహ్మద్‌ అలీ తెలిపారు. 


Also Read: చాక్లెట్ ఇస్తానంటే సరే అంకూల్ అంటూ నమ్మి వెళ్లింది నాలుగేళ్ల పాప.. పక్కకు తీసుకెళ్లిన అతడు.. 


నగల కోసం వృద్ధురాలి హత్య


బంగారం కోసం విజయనగరం జిల్లాలో వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండాం గ్రామానికి చెందిన ఇప్పర్తి సింహాచలం(70) వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. వృద్ధురాలు తీవ్ర గాయాలతో ఇంట్లో పడి ఉండటాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె చనిపోయింది. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సింహాచలం చెల్లెలి కొడుకు సంతోష్​ కుమార్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు కోసం హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆమె ముక్కు, చెవులు కోసేసి బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.


Also Read: దర్శకుడు శంకర్ అల్లుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయిని.


Also Read: Actress Molested: విమానంలో నటి నడుంపట్టుకుని ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త.. పురుషుడు అనుకున్నాడట..


Also Read:  మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి