ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో దాదాపుగా అంతర్జాతీయ వ్యాపారాలన్నీ మూసేసింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, సింగపూర్‌లో సేవలు నిలిపివేయగా తాజాగా లెబనాన్ వ్యాపారాన్ని ముగించింది. కాస్త లాభదాయకంగా ఉన్న యూఈలో సేవలు కొనసాగుతాయని అయితే ఫుడ్ డెలివరీ ఉండదని పేర్కొంది. డైనింగ్ ఔట్ బిజినెస్ కొనసాగించనుంది.
'లెబనాన్‌లో మా కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం. ఇప్పటి వరకు మిగిలిన అంతర్జాతీయ వ్యాపారం ఇదొక్కటే. యూఏఈలో మాత్రం డైనింగ్ ఔట్ సేవలు కొనసాగుతాయి. గతేడాది నుంచీ అంతర్జాతీయ వ్యాపారాలను నిలిపివేస్తున్నాం' అని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.
జొమాటో తన వ్యాపారాన్ని మూడు ప్రాంతాలుగా విభజించింది. అవి భారత్, యూఏఈ, రెస్టాఫ్ వరల్డ్ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, మలేసియా, యూఎస్‌ఏ, లెబనాన్, టర్కీ, చెక్, స్లోవేకియా, పొలాండ్, కతార్, ఐర్లాండ్). ఇప్పటి వరకు ఆదాయం పరంగా ఆ సంస్థకు అతిపెద్ద మార్కెట్ భారత్ (రూ.981 కోట్లు, జులై-సెప్టెంబర్ క్వార్టర్) మాత్రమే. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ (రూ.33 కోట్లు) ఉంది.
తాజా త్రైమాసికంలో మూసేసిన లెబనాన్ బిజినెస్ జొమాటో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జొమాటో ఐర్లాండ్ లిమిటెడ్ కింద ఉంది. అంతకు ముందు క్వార్టర్లో సింగపూర్‌లోని జొమాటో మీడియా ప్రైవేట్ లిమిటెడ్, బ్రిటన్‌లో జొమాటో యూకే లిమిటెడ్, అమెరికాలోని నెక్స్టబుల్ ఇంక్‌ను మూసేసింది. 'క్లీన్ డ్రైవ్'లో భాగంగా మూసివేతను చేపట్టింది.
లాభాలు వచ్చే ప్రాంతాల్లో వ్యాపారంపై దృష్టి పెట్టాలని జొమాటో నిర్ణయించుకుంది. మెట్రోలే కాకుండా చిన్న నగరాలు, పట్టణాల్లో సేవలను విస్తరించనుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ కామర్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఇండియన్ స్టార్టప్పుల్లో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. సంజీవ్ బిక్‌చందానికి చెందిన ఇన్ఫోఎడ్జ్, చైనాకు చెందిన అలీబాబా మాదిరిగా అంకురాల్లో పెట్టుబడులు పెట్టనుంది.
Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్..! క్రెడిట్ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి