ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య జల వివాదాల విషయంలో కేంద్రం డ్రామా ఆడుతోందని వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రెస్‌మీట్లలో సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు. ట్రైబ్యునల్ అంశం కూడా అందులో ఉంది. కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ పై కేసీఆర్ విమర్శలు చేశారు. ఈ కారణంగా షెకావత్ గురువారం ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టారు. కేసీఆర్ తన పేరు ప్రస్తావించి విమర్శలు చేశారని అందుకే ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందని అందుకే చెబుతున్నానని స్పష్టం చేశారు.


Also Read : తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్


కొత్త ట్రైబ్యునల్ కావాలని తెలంగాణనే సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగినప్పుడు రెండు రోజుల్లో పిటిషన్ ఉపసంహరించుకంటానని కేసీఆర్ చెప్పారని.. కానీ ఏడు నెలల తర్వాత ఉపసంహరించుకున్నారన్నారు. పిటిషన్ కోర్టులో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని గుర్తు చేశారు. నెల క్రితమే సుప్రీంకోర్టు తెలంగాణ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ట్రైబ్యూనల్  ఆలస్యానికి తాము కారణం కాదని.. కేసీఆరే కారణమని షెకావత్ స్పష్టం చేశారు. కేసీఆర్ కేంద్రాన్ని విమర్శించడం విడ్డూరమని షెకావత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధాని కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారని తెలిపారు.  ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే .. బోర్డుల పరిధిని నోటిఫై చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశాం. న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయం అడిగాం.. దాని కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.  అవకాశం ఉన్నంత మేర ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్‌ ఇలా మాట్లాడకూడదన్నారు. కేసీఆర్‌ చేస్తున్నది అంతా ఒక డ్రామా అనితీసి పడేశారు. 


Also Read : హుజురాబాద్‌ ఫలితంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. 13న టీ పీసీసీ నేతలతో ఢిల్లీలో సమీక్ష !


నదీ బోర్డులను నోటిఫై చేసినా ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించకపోవడంపైనా షెకావత్ స్పందించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అడగడంతోనే నోటిఫై చేశామని గుర్తుచేశారు. రాష్ట్రాల పరిధిలో జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సముఖంగా ఉందని షెకావత్ తెలిపారు. కేసీఆర్ చేసిన విమర్శలపై స్పందించడానికి మాత్రమే షెకావత్ ప్రెస్‌మీట్ పెట్టడంతో ఇతర విషయాలపై మాట్లాడలేదు. 


Also Read : కల్వకుంట్ల కవితకు మరోసారి ఎమ్మెల్సీ చాన్స్ వస్తుందా ?


హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల్లో రెండు సార్లు ప్రెస్‌మీట్ పెట్టి జల వివాదాల దగ్గర్నుంచి విభజన హామీల వరకు అనేక విషయాల్లో కేంద్రం తీరును తప్పు పట్టారు. ఈ క్రమంలో  కేంద్ర జల వనరుల మంత్రి స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఆలస్యం కేసీఆర్‌దేనని ప్రకటించడంతో .. తెలంగాణ సీఎం కూడా మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.  


Also Read: ఎదురొచ్చిన ఎన్నికల కోడ్.. కేసీఆర్ వరంగల్ టూర్ వాయిదా.. విజయగర్జన సభ కూడా !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి