తెలంగాణ రాష్ట్ర సమితికి కాలం కలసి రావడం లేదు. హుజురాబాద్‌లో ఓటమి తర్వాత శ్రేణుల్లో జోష్ తీసుకు వస్తుందని భావించిన విజయగర్జన సభకు ఆటంకాలు తప్పడం లేదు. ఓ వైపు వరంగల్ రైతులు తమ పొలాల్లో సభ వద్దని ఆందోళన చేస్తూంటే మరో వైపు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చేసింది. దీంతో సభను వాయిదా వేయక తప్పలేదు. హుజురాబాద్ ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్ అక్టోబర్ 25వ తేదీన ప్లీనరీ , నవంబర్ 15వ తేదీన విజయగర్జన బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 25న ప్లీనరీని విజయవంతంగా నిర్వహించారు. కానీ విజయగర్జన సభకు మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయి. 


Also Read : రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?


నవంబర్ రెండో తేదీన హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. అంతకు ముందే విజయనగర్జన సభను నవంబర్ 29వ తేదీకి మార్చాలని నిర్ణయించారు. కేసీఆర్ ఆమరణదీక్ష నిర్వహించిన రోజు కాబట్టి దీక్షా దివస్‌గా ఆ రోజు జరుపుతున్నారు కనుక.. విజయ గర్జన నిర్వహించాలని వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాట్లు ప్రారంభించడానికి రైతుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. తమ పొలాల్లో సభ పెట్టవద్దని ఆందోళన చేశారు. దీంతో బలవంతంగా పోలీసుల రక్షణతో ఏర్పాట్ల పనులు ప్రారంభించాల్సి వచ్చింది. 


Also Read: పోడు భూములపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి నోటీసులు, అసలు ఏంటి ఈ వ్యవహారం?


అయితే ఇప్పుడు 29వ తేదీన కూడా విజయగర్జన నిర్వహించలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలు వరంగల్‌లో కూడా ఉండటంతో అక్కడ కూడా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిబంధనల ప్రకారం.. పది లక్షల మందితో సభ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. దీంతో సభను వాయిదా వేస్తూ టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. 


Also Read : ఈ స్కూల్ చూసి ఆశ్చర్యపోయిన కేటీఆర్.. ఇలాంటివే రాష్ట్రంలో మరిన్ని.. కేటీఆర్ వెల్లడి


వాస్తవానికి సీఎం కేసీఆర్ గురువారం వరంగల్‌లో పర్యటించాలనుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలనుప్రారంభించి సభా ఏర్పాట్లపై సమీక్ష చేయాలనుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా కేసీఆర్ టూర్ వాయిదా పడింది. సభను కూడా వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో  ప్రకటన లేదు. డిసెంబర్ పధ్నాలుగో తేదీ తర్వాత కోడ్ ముగిసిపోతుంది. ఆ తర్వాత సభ నిర్వహించే అవకాశం ఉంది. 


Also Read: పేరు విలియమ్స్ .. చేయాల్సింది పియానో వాయించడం.. చేసింది అమ్మాయిలకు టోకరా ! ఈ మోసగాడి కథ మామూలుగా లేదు.. !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి