ఇది బుక్ టైటిలా.. లేక బుక్కేనా? 26 వేల 21 అక్షరాలతో గిన్నిస్ రికార్డ్

బుక్ టైటిల్ అంటే.. ఓ నాలుగు అక్షరాలు.. మహా అయితే ఇంకాస్త పెంచి మరో రెండు యాడ్ చేస్తాం. కానీ ఓ వ్యక్తి వేల అక్షరాలతో బుక్ టైటిల్ పెట్టాడు. అతడెవరో మీరూ తెలుసుకోండి.

Continues below advertisement

సాధారణంగా ఓ బుక్ టైటిల్ అంటే ఏం పెడతాం. ఏదో చిన్నగా జనాల్లో ఈజీగా రిజిస్టర్ అయ్యేలా పెడతాం అవునా. కానీ ఈయన మాత్రం కొంచెం డిఫరెంట్. The Historical Development of the Heart I.e. Its Formation from అని మొదలయ్యే ఈ బుక్ టైటిల్ లో అక్షరాలా 3,777 పదాలు 26వేల21 అక్షరాలు ఉంటాయి. ఇంత పెద్దగా ఉంటే దాన్ని బుక్ టైటిల్ అనరు. బుక్కే అంటారు అనుకుంటున్నారా. ఇంచుమించుగా అలాంటిదే. వాస్తవానికి ఈ బుక్ టైటిల్ ఉన్న అక్షరాలు చదవాలంటే మైక్రోస్కోప్ వాడాల్సిందే. ఇప్పుడు ఎవరూ చేయని ఈ ఎటెంప్ట్ కి గిన్నిస్ బుక్ రికార్డు సైతం కైవసం చేసుకున్నాడు ఓ కుర్రాడు.

Continues below advertisement

ఇంతకీ ఇతనెవరనే గా మీ సందేహం కదా. డాక్టర్ విత్యాల యతీంద్ర. ఇరవైనాలుగేళ్ల వయస్సు. కిర్గిస్థాన్ లో వైద్యవిద్యను పూర్తి చేశారు. అందరిలానే ఓ మంచి ప్యాకేజ్ కి డాక్టర్ గా సెటిల్ అయిపోవటమే...లేదా ఓన్ గా హాస్పిటల్ కట్టుకోవటమో చేయలేదు ఈ యంగ్ స్టర్. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు.. చుదువుకున్న మెడిసిన్ కి ఓ అర్థం ఉండాలనుకున్నాడు. అందుకే చదువుకుంటున్న టైం నుంచే విభిన్నమైన ప్రయాణం చేస్తూ...ఇప్పటివరకూ 12 ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో 51 కోర్సులను పూర్తి చేశాడు. అన్నింటికంటే వైద్యరంగంలో వినూత్న, అత్యంత అరుదైన విషయాలపై పరిశోధనలు చేసే యంగ్ సైంటిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. 

మామూలు అకాడమిక్స్ కాకుండా రీసెర్చ్ సైడ్ వెళ్లాలనుకున్న యతీంద్ర.. మెడికల్ ఫెసిలీటీస్ లేక చాలా మంది చనిపోతుండటం చూడటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మెడికల్ డయాగ్నసిస్ మీద కంప్లీట్ అవేర్ నెస్ లేకపోవటం వలన డ్రగ్స్ మీద డిపెండ్ కావలసి ఉంటుందంటున్న యతీంద్ర....అర్బనైజేష్ అంటే డ్రస్ లో, హైఫై బిల్డింగ్ స్ లోనో కాదు.. నాలెడ్జ్ పెంచుకోవటమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా క్యూర్ కాని ఎన్నో వ్యాధులు, అరుదైన డిసీస్ ల పై నిర్వహించే పరిశోధనల్లో పాల్గొన్న యతీంద్ర.. తను నేర్చుకుంటున్న నాలెడ్జ్ ను నెక్స్ట్ జనరేషన్స్ కి అందించే ప్రయత్నం చేస్తున్నాడు. తను చేస్తున్న పరిశోధనల వైపు మిగిలిన వారిని ఆకర్షించేందుకే గిన్నిస్ రికార్డు ప్రయత్నం చేశాడు స్పైడర్ నుంచి హ్యూమన్ వరకూ హార్ట్ ఉన్న ప్రతీ జీవిని మెన్షన్ చేస్తూ బుక్ రాసి వాటన్నింటినీ టైటిల్ లో ఉండేలా సరికొత్త ప్రయత్నం చేశాడు. అది యూనిక్ అటెంప్ట్ కావటంతో 2020 కి గానూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించాడు.

కిర్గిస్థాన్ సహా అనేక దేశాల్లో వైద్యపరిశోధనల్లో పాలుపంచుకున్న యతీంద్ర....తన సేవలకు గాను కర్మవీరచక్ర, ఛాంపియన్స్ ఆఫ్ ది ఛాంపియన్స్‌, మహాత్మా గాంధీ నేషనల్ అవార్డులను అందుకున్నాడు. అకాడమీస్ కాకుండా చాలా విషయాలుంటాయంటున్న యతీంద్ర.. ఎక్స్ ప్లోర్ చేస్తే ఇంపాజిబుల్ అనుకన్న వన్నీ పాజిబులేనని చెబుతూ తనదైన మార్గంలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం తన సొంతూరు వరంగల్ పాఠశాల విద్యార్థుల కోసం కోవిడ్ -19 అవగాహన ప్రచారం నిర్వహిస్తున్నారు. అదీ క్యూ ఆర్ కోడ్ పద్ధతిలో చేస్తూ అక్కడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

Also Read: Food Label: ఫుడ్ ప్యాకింగ్ లేబుళ్లపై ఇలా రాసి ఉంటే కొనే ముందు ఆలోచించండి, ఎందుకంటే...

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

Continues below advertisement