Difference Between Crypto Coins And Crypto Tokens: రెండేళ్ల కాలంలోనే క్రిప్టో కరెన్సీకి విపరీతమైన క్రేజ్ లభించింది. ఇన్వెస్టర్ల ప్రపంచంలో ఎక్కడ చూసినా వీటిపైనే చర్చిస్తున్నారు. క్రిప్టో కాయిన్, క్రిప్టో టోకెన్ల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. సరైన సమాచారం తెలియకుండానే ఎంతో మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టడం గమనార్హం. వారిలో చాలామందికి కొనుగోలు చేస్తోంది కాయినా లేక టోకెనా అన్నదీ తెలియదు. ఇంతకీ వీటి మధ్య తేడా ఏంటి?
చాలా మంది క్రిప్టో కాయిన్లు, టోకెన్లు ఒకటేనేమో అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు. క్రిప్టో పరిశ్రమలోని నిపుణుల ప్రకారం అన్ని కాయిన్లను టోకెన్లుగా పరిగణించొచ్చు. కానీ ప్రాథమిక స్థాయిలో అన్ని టోకెన్లు కాయిన్లు కావు. సాధారణంగా క్రిప్టో కాయిన్లను బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారంగా సృష్టిస్తారు. కరెన్సీ ట్రేడ్, వాల్యూ స్టోర్ చేసేందుకు ఉపయోగిస్తారు. కానీ టోకెన్లు మరో కాయిన్ బ్లాక్‌చైన్‌ను వాడుకుంటాయి.
ఉదాహరణకు ఎథిరియమ్ ఒక బ్లాక్‌చైన్. దీనికి సంబంధించిన నేటివ్ కాయిన్ ఎథెర్. అయితే బ్యాట్, లూప్‌రింగ్ వంటి టోకెన్లు ఈ బ్లాక్‌చైన్‌లో నిర్వహిస్తారు. కాయిన్లు నేరుగా ప్రతిపాదిత మారకం మాధ్యమంగా ఉంటాయి. మరోవైపు టోకెన్లు ఒక అసెట్‌ను ప్రతిబింబిస్తాయి. టోకెన్లను విలువ లేదా ట్రేడింగ్, వడ్డీని పొందడానికి ఉంచుకుంటారు. యూనిస్వాప్, చైన్‌లింక్, పాలీగాన్ ఇలాంటి టోకెన్లకు ఉదాహరణ.
క్రిప్టో కాయిన్ల లావాదేవీలను బ్లాక్‌చైన్‌లో నిర్వహిస్తారు. టోకెన్లు ట్రేడ్ చేయడానికి స్మార్ట్ కాంట్రాక్టులపై ఆధారపడతాయి. మీరు ఒక టోకెన్‌ను ఖర్చు చేశారనుకోండి, అది ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ అవుతాయి. ఎన్‌ఎఫ్‌టీ (నాన్ ఫంగీబుల్ టోకెన్లు)లు ఈ కోవలోకే వస్తాయి. ఓనర్‌షిప్ మార్పును మాన్యువల్‌గా బదిలీ చేస్తారు. కాయిన్ మాత్రం ఒక చోట నుంచి మరో చోటకు మారదు. అన్ని లావాదేవీలు బ్లాక్‌చైన్లలో రికార్డు అవుతాయి.
ఒక వ్యక్తికి ఏం సొంతమో టోకెన్ ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా టోకెన్‌ను ఉపయోగిస్తారని అంచనా. ఉదాహరణకు మీ కారు టైటిల్ ఒక టోకెన్ అనుకుందాం. ఆ కారు అమ్మినప్పుడు ఆ టైటిల్ విలువను మరొకరికి బదిలీ చేస్తారు. అయితే ఆ టైటిల్‌తో మీరు మరొకటి మాత్రం కొనలేరు. అందుకే నిపుణుల ప్రకారం పెట్టుబడికైతే కాయిన్ అత్యుత్తమం. సేవలకైతే టోకెన్లు ఉత్తమం.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!