కొత్త సంవత్సరం రెండో రోజూ భారత స్టాక్‌ మార్కెట్లు దుమ్మురేపాయి. కీలక సూచీలు భారీ స్థాయిలో లాభపడ్డాయి. పవర్‌, ఆయిల్‌, గ్యాస్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు రాణించడంతో మదుపర్ల సంపద మరింత పెరిగింది. సెన్సెక్స్‌ 672 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 179 పాయింట్లు పెరిగింది.


చివరి సెషన్లో 59,183 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,343 పాయింట్ల వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 59,084 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి గరిష్ఠ స్థాయి 59,937ని అందుకుంది. చివరికి 672 పాయింట్ల లాభంతో 59,855 వద్ద ముగిసింది.


Also Read: Fake Pan Card Check: పాన్‌ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి


Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! రూ.210 పడిపోయిన పసిడి ధర.. వెండి మాత్రం స్వల్పంగా తగ్గుదల.. తాజా ధరలు ఇవీ..


Also Read: Tata Altroz: అల్ట్రోజ్‌లో కొత్త బడ్జెట్ వేరియంట్.. లాంచ్ త్వరలోనే!


సోమవారం 17,625 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేడు 17,681 వద్ద మొదలైంది. 17,593 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం సమయంలో ఇంట్రాడే గరిష్ఠమైన 17,827ని తాకింది. చివరికి 179 పాయింట్ల లాభంతో 17,805 వద్ద ముగిసింది.


బ్యాంక్ నిఫ్టీ జోరు ప్రదర్శించింది. 418 పాయింట్లు లాభపడింది. ఉదయం 36,551 వద్ద ఆరంభమైన సూచీ 36,887 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 36,374 వద్ద కనిష్ఠాన్ని చేరుకున్న సూచీ చివరికి 36,840 వద్ద ముగిసింది.







నిఫ్టీలో 35 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. 15 కంపెనీలు నష్టపోయాయి. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, టాటా కన్జూమర్‌, సన్‌ఫార్మా, శ్రీసిమెంట్స్‌ 1-2 శాతం వరకు నష్టపోయాయి.


Also Read: Budget 2022: రైతన్నకు శుభవార్త! 4% వడ్డీకి రూ.18 లక్షల కోట్లు పంట రుణాలు ఇవ్వనున్న కేంద్రం!


Also Read: Petrol-Diesel Price, 4 January: వాహనదారులకు ఊరట.. ఇక్కడ ఇంధన ధరలు భారీగా తగ్గుదల, ఈ నగరాల్లో మాత్రం ఎగబాకి.. తాజా రేట్లు ఇవీ..


Also Read: Budget 2022: ప్రభుత్వ బడ్జెట్‌ ఇన్ని రకాలా? ఇండియాలో ఏది అమలు చేస్తారో తెలుసా?