How to check for a fake pan card: కొన్నేళ్లుగా డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇదే సమయంలో ఆన్‌లైన్ వేదికగా మోసాలు చేయడమూ ఎక్కువైంది. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాన్ కార్డుల మోసాలు బయట పడుతున్నాయి. పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. బ్యాంకులు, ఆస్పత్రులు, పాఠశాలలు, ఆర్థిక, నగదు సంబంధిత వ్యవహారాల్లో పాక్ ఎంతో కీలకం.
ఈ మధ్య కాలంలో నకిలీ పాన్ కార్డు కేసులు ఎక్కువ కావడంతో ఆదాయపన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏది నకిలీదో ఏది అసలైందో తెలుసుకొనేందుకు పాన్ కార్డులకు క్యూఆర్ కోడ్ జత చేస్తోంది. ఈ క్యూఆర్ కోడ్ నిజమైన పాన్ ఏదో, నకిలీ పాన్ ఏదో సులభంగా గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీరూ అసలు, నకిలీ పాన్ కార్డులను గుర్తించొచ్చు. ఇందుకోసం మీరు ఆదాయపన్ను శాఖ నుంచి ఒక యాప్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది.
అసలు, నకిలీ పాన్ కార్డులను గుర్తించే ప్రక్రియ
- పాన్ కార్డు అసలు, నకిలీ తెలుసుకొనేందుకు ముందుగా మీరు ఆదాయపన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి.
- మొదట www.incometax.gov.in/iec/foportal ను సందర్శించాలి.
- ఆ తర్వాత 'వెరిఫై యువర్ పాన్' ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ ముందు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్న పాన్ సమాచారం మొత్తం ఫిల్ చేయాలి.
- పాన్ కార్డు సంఖ్య, పేరు, పుట్టిన రోజు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
- ఇవన్నీ ఎంటర్ చేయగానే మీరు ఇచ్చిన సమాచారం మ్యాచ్ అవుతుందో లేదో సమాచారం మొబైల్‌కు వస్తుంది.
- ఈ సమాచారం ద్వారా మీరు పరిశీలిస్తున్న పాన్ కార్డు సరైందో కాదో తెలుసుకోవచ్చు.
Also Read: Car Sales Dec 2021: హ్యూందాయ్‌కు 'టాటా' మోటార్స్ సెగ.. డిసెంబర్లో కార్లను మామూలుగా అమ్మలేదు మరి!
Also Read: Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
Also Read: IPO craze: 23 కంపెనీలు.. రూ.44000 కోట్లు! 2022లోనూ ఐపీవో క్రేజ్
Also Read: Tesla: మళ్లీ సర్‌ప్రైజ్ చేసిన మస్క్! ఆటోపైలట్ హెడ్‌గా చెన్నై వ్యక్తి ఎంపిక