తూర్పు గోదావరి జిల్లాలో కుల వివక్ష వ్యవహారం కలకలం రేపింది. ఈ రోజుల్లో కూడా కులం పేరుతో చిన్న పిల్లలను వేరు చేసి వ్యవహరించిన ఘటన విస్మయం కలిగిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజవర్గం కే గంగవరం మండలంలో బ్రహ్మపురి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్కూలు పిల్లల్లో ఓ కులానికి చెందిన విద్యార్థులను వెలివేశారు. వారిని కొత్త భవంతిలోకి రానివ్వకుండా కింద కూర్చొని పాఠాలు చెప్తున్నారు. మరో కులానికి చెందిన వారికి మాత్రం కొత్త భవనంలో బెంచీలపై కూర్చొపెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులైన చిన్న పిల్లలను ఇలా కుల వివక్ష పేరుతో వేరు చేయడం సంచలనంగా మారింది. దీనిపై స్థానికులు నిరసనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: Anantapur: ఆశయం ఎవరెస్ట్ శిఖరం పైన.. ఆర్థిక స్తోమత అధ:పాతాళంలో.. దాతల కోసం పర్వతారోహకుడి ఎదురుచూపులు
బ్రహ్మపురి గ్రామంలో ఓ కులానికి చెందిన దాదాపు 26 మంది విద్యార్థులను వెలివేశారు. టీచర్లు కొత్త బిల్డింగ్‌లో కాలు పెట్టనివ్వలేదు. అగ్ర కులాల విద్యార్థులకు అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఓ సామాజిక వర్గానికి మాత్రం నేల మీద తరగతులు నిర్వహించారు.
ఎంతో కాలంగా ఉంటున్న ఎలిమెంటరీ స్కూలులో అన్ని వసతులు ఉన్నా ఇక్కడి ఓ వర్గానికి చెందిన విద్యార్థులను వేరే పాఠశాలకు కుల ప్రాతిపదికన మారుస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇది కేవలం కుల వివక్షతో చేసిన పనేనని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి వేరే పాఠశాల నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. కులం పేరుతో విద్యార్థులను వేరు చేస్తున్న వారిపై చట్టపరమైచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్రామస్థుల నిరసనకు ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. మండల విద్యాశాఖ అధికారుల దాష్టీకానికి నిదర్శనం ఇదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి విలువ మాలిన పనులని.. సామాజిక రుగ్మతను పెంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Nellore Crime: ప్రేమతో కూర వండిన భార్య.. మొహం చిట్లించిన భర్త, ఆవేశంతో ఘోరానికి పాల్పడ్డ భార్య
Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్... !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి