వివాహ బంధంలో చిన్న చిన్న మనస్పర్థలు, కోపతాపాలు కొన్ని సార్లు అంతులేని నష్టాన్ని కలిగిస్తాయి. ఎవరు ఏ తప్పు చేసినా సర్దుకుపోకపోతే చివరకు కోలుకోలేని ఇబ్బందులు తలెత్తుతాయి. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో జరిగిన ఘటనే దీనికి తాజా ఉదాహరణ. ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతున్న భార్యా భర్తలిద్దరూ చిన్న విషయంలో పంతాలకు పోయారు. భర్త కూర బాగోలేదని కసురుకునేసరికి భార్య ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. 


వినడానికి ఇది చాలా సిల్లీగా ఉన్నా నిజం. అవును, కూర విషయంలోనే వారిద్దరికీ గొడవ వచ్చింది. ఆ గొడవలో ఒకరి ప్రాణం పోయింది. అంతా అయిపోయాక ఇప్పుడు భర్త తీరిగ్గా విచారించినా జరిగిదేం లేదు. పోయిన ప్రాణం తీసుకు రాలేడు, కనీసం ఆత్మహత్య చేసుకునే ముందు ఆ భార్య ఒక్క క్షణం ఆలోచించినా ఇంత అనర్ధం జరిగేది కాదు. కానీ ఇద్దరూ ఈ విషయంలో తొందర పడ్డారు, ఫలితంగా ఓ ప్రాణం పోయింది. 


చిల్లకూరు మండలం వరగలి గ్రామంలో కత్తి వెంకయ్య, వెంకట రమణమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరే ఆ ఇంట్లో ఉండేవారు. చుట్టుపక్కలవారితో కలుపుగోలుగా ఉండేది వెంకట రమణమ్మ. ఇద్దరూ కూలిపనులకు వెళ్తూ జీవనం గడిపేవారు. ఈ క్రమలో ఆదివారం వెంకట రమణమ్మ కూర సరిగా వండలేదని వెంకయ్య కసురుకున్నాడు. కూర వండటం సరిగా రాదని అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే భర్త మాటల్ని తీవ్రంగా భావించిన వెంకట రమణమ్మ.. ఆయన బయటకు వెళ్లగానే ఇంట్లోని పురుగుల మందుని తాగేసింది. ఇంటికి తిరిగొచ్చిన భర్త భార్య అపస్మారక స్థితిలో ఉండంట చూసి కంగారు పడ్డాడు. వెంటనే గూడూరులోని ఏరియా  ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొెందుతూ వెంకట రమణమ్మ సోమవారం మృతి చెందింది. కూర విషయంలో జరిగిన గొడవతో తన భార్య ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు వెంకయ్య. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. 


Also Read:  సినిమా టిక్కెట్లపై అఫిడవిట్‌కు సమయం కావాలన్న ప్రభుత్వం..., ఫిబ్రవరికి వాయిదా వేసిన హైకోర్టు !


కేవలం కూర విషయంలోనే గొడవ జరిగిందా.. లేక వెంకట రమణమ్మ ఆత్యమహత్యకు ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతకుముందు నుంచి ఏమైనా ఇతర విషయాల్లో మనస్ఫర్థలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై సుధాకర్ రెడ్డి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Also Read: జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.... డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు


Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్... !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి