తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోదావరి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా వాలంటీర్ ను కాపాడేందుకు ప్రయత్నించి వార్డు కౌన్సిలర్ మరణించారు. గోదావరిలో దూకిన మహిళా వాలంటీర్ ను కాపాడేందుకు ప్రయత్నించిన ముమ్మిడివరం నగర పాలక కౌన్సిలర్ మృత్యువాత పడ్డారు. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ పై నుంచి మహిళా వాలంటీర్ పెదపూడి లక్ష్మికుమారి గోదావరిలో దూకింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ముమ్మిడివరం నగరపంచాయితీ 12వార్డు కౌన్సిలర్ విజయ్ వాలంటీర్ ను రక్షించేందుకు నదిలో దూకారు. విజయ్ కు ఈత వచ్చినప్పటికీ ఆమెను కాపాడే ప్రయత్నంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వార్డు కౌన్సిలర్ రక్షించేందుకు ప్రయత్నించారు కానీ ఒడ్డుకు చేర్చే లోపే విజయ్ మృతి చెందారు. స్థానికులు యువతిని రక్షించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ముమ్మిడివరం ఆసుపత్రికి తరలించారు. విజయ్ రెండుసార్లు ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిలర్ గా గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత చెల్లి అశోక్ పై విజయ్ గెలిచారు. విజయ్ మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 


Also Read: కంటేపల్లి రైల్వే గేట్ వద్ద కారులో మంటలు... అనుమానాస్పదరీతిలో వ్యక్తి సజీవదహనం


మిర్చి రైతు ఆత్మహత్య


అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో మిర్చి రైతు అజ్మీరా శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నారు. శ్రీను తనకున్న మూడు ఎకరాల్లో మిర్చి పంటను, మరో ఎకరంన్నర కౌలుకు తీసుకొని వరి వేశారు. పంట కోసం రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ పంటతో అప్పులు తీరుతాయని అనుకున్నాడు. మిర్చి పంటకు వైరస్ సోకడంతో దిగుబడి తగ్గిపోయింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. మనస్తాపానంతో శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం మిర్చి తోటకు మందు కొడుతూ భార్యను ఇంటికి వెళ్లిపోమన్నాడు. అదే పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు శ్రీను. తోటకు ఎన్ని మందులు కొట్టినా ఫలితం కనిపించడం, రూ. 5 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగేశా అని భార్యకు చెప్పాడు. వెంటనే రైతు శ్రీనును కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. ప్రభుత్వం మిర్చి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Also Read: ఎనీ డెస్క్ యాప్ తో మనీ గల్లంతు... కడప వాసి అకౌంట్ హ్యాక్ చేసి రూ.లక్షలు స్వాహా... బిహార్ లో సైబర్ కేటుగాడు అరెస్టు


Also Read: జహీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... బైకును ఢీకొట్టిన కారు...చిన్నారి సహా నలుగురు మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి