నెల్లూరు జిల్లాలో సంచలనం ఘటన జరిగింది. వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఓ కారు తగలబడింది. కారుతోపాటు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. పొలాల్లో మంటలు రావడంతో అటుగా వెళ్తున్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి ఆనవాళ్లు లేకుండా కాలిపోయాడు. 


Also Read: ఎనీ డెస్క్ యాప్ తో మనీ గల్లంతు... కడప వాసి అకౌంట్ హ్యాక్ చేసి రూ.లక్షలు స్వాహా... బిహార్ లో సైబర్ కేటుగాడు అరెస్టు


అసలేం జరిగింది..?


కంటేపల్లి ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడకు ఎవరూ బయట వ్యక్తుల రాకపోకల ఉండవు. ఈ క్రమంలో కొత్త ఏడాది అక్కడికి కారు రావడం, అది తగలబడటం చూస్తుంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు నెంబర్ AP28DU5499 ఆధారంగా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి ఎవరు, కారుని తగలెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా అక్కడికి తీసుకొచ్చి హత్య చేశారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. సజీవంగా ఉన్న వ్యక్తిని తగలబెట్టారా లేక హత్య చేసి అక్కడికి తీసుకొచ్చి కారుతో సహా దగ్ధం చేశారా అనే విషయం కూడా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. 


Also Read: జహీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... బైకును ఢీకొట్టిన కారు...చిన్నారి సహా నలుగురు మృతి


ఘటనపై ఎస్పీ ఆరా


కారు తగలబడటం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, కారు టైర్ల ముద్రలను బట్టి చూస్తే, కారుని జాగ్రత్తగా తీసుకొచ్చి రివర్స్ లో పార్కింగ్ చేసినట్టు స్థానికులు అంటున్నారు. స్థానికులు చూసేసరికి స్పందించే సమయానికి కారులో ఓ వ్యక్తి డ్రైవింగ్ సీట్లో మరణించి ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. కారు తగలబడటం, కారుతోపాటు ఓ వ్యక్తి కూడా చనిపోవడం అది కూడా కొత్త సంవత్సరం తొలిరోజున కావడంతో కలకలం రేగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిది సంచలనంగా మారింది. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై ఆరా తీశారు. 


Also Read: చిన్నప్పుడు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేదని... ఇప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి