స్కూళ్లలో బ్రేక్ బెల్ కొట్టగానే పిల్లలందరూ గేట్ వద్దకు పరిగెడుతూ వెళ్లేవారు. అక్కడ ఓ తాత ఉడకబెట్టిన వేరుశనక్కాయలు అమ్ముతుంటాడు. పిల్లలు ఉత్సాహంగా తమ వద్ద ఉన్న డబ్బులతో ఆ శనక్కాయలు కొనుక్కోనేందుకు తాత చుట్టూ చేరి అల్లరి చేసేవారు. డబ్బులు ఉన్న వాళ్లు కొనుక్కుంటే తమ వద్ద డబ్బులు లేనివాళ్లు దూరంగా ఆ తాతను చూస్తూ ఉండిపోయేవాళ్లు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఉంటాయి. చిన్నప్పుడు జరిగిన ఆ ఘటనలు గుర్తుచేసుకుంటూ అలా ఒకసారి బాల్యంలోకి వెళ్తుంటాం ఒక్కోసారి. కానీ తూర్పుగోదావరి జరిగిన ఘటన మాత్రం వీటన్నింటికీ చాలా విభిన్నం. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తన పిల్లలకు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేకపోయానని, గుర్తుపెట్టుకుని ఆ వ్యక్తిని వెతికి ఆర్థికసాయం చేశాడో వ్యక్తి. అతను చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రసంశలు వెల్లువెత్తాయి. 


Also Read:  నగరి వైఎస్ఆర్‌సీపీలో కోవర్టులు.. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి రోజా ఫిర్యాదు !


పన్నెండేళ్ల క్రితం ఓ చిరువ్యాపారి వద్ద వేరుశనక్కాయలు కొనుక్కొని డబ్బులు ఇవ్వలేదు ఓ బాలుడు. ఈ విషయం గుర్తుపెట్టుకున్న బాలుడు ఆ తాతకు డబ్బులు ఇచ్చేద్దామని చాలాసార్లు అతడి కోసం వెతికాడు. సుమారు పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ చిరువ్యాపారి ఎక్కడున్నాడో తెలుసుకుని రూ.25 వేలు ఆర్థికసాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన మోహన్‌ నేమాని కుటుంబం అమెరికాలో ఉంటున్నారు. వీరి కుటుంబం 2010లో కాకినాడ బీచ్‌ను సందర్శించారు. మోహన్‌ తన కుమారుడు ప్రణవ్‌, కూతురుకి బీచ్‌లో గింజాల పెదసత్తియ్య అనే వ్యక్తి వద్ద వేరుశనక్కాయలు కొన్నారు. కానీ పర్సు మర్చిపోవడంతో అతనికి డబ్బులు ఇవ్వలేకపోయారు. కానీ అప్పుడు ప్రణవ్ అతడితో ఓ ఫొటో దిగారు. 


Also Read: అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులేమీ లేవు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్


అప్పటినుంచి వారి కుటుంబం కాకినాడ వచ్చిన ప్రతిసారీ పెదసత్తియ్య కోసం వెతికేవారు కానీ ఫలితం లేకపోయింది. మోహన్‌ తన స్నేహితుడైన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఆ విషయం గురించి చెప్పారు. ఎమ్మెల్యే తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రణవ్‌ తీసుకున్న ఫొటో పోస్టుచేశారు. పెదసత్తియ్య కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని కోరారు. చివరికి పెదసత్తియ్య కుటుంబం జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో ఉంటున్నట్లు తెలిసింది. పెద సత్తియ్య మరణించగా ఆయన కుటుంబసభ్యులు గురువారం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి తన ఇంటికి పిలిపించారు. ఎన్‌ఆర్‌ఐ మోహన్‌, ఆయన పిల్లలు సత్తియ్య కుటుంబ సభ్యులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.


Also Read:  సోము వీర్రాజుకు కింగ్ జార్జ్ పేరూ నచ్చలేదు ..కేజీహెచ్ పేరు మార్చాలని డిమాండ్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి