ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పేర్లు మార్చాలనే డిమాండ్‌నే తమ ఎజెండాగా మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నటికి నిన్న గుంటూరులోని జిన్నాటవర్ సెంటర్ పేరు మార్చాలని లేకపోతే కూల్చేస్తామని భీకరమైన ప్రకటనలు చేసిన నేతలు ఒక్క రోజు తిరగకుండానే విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి ప్రస్తావన తీసుకు వచ్చారు. విశాఖలో కింగ్ జార్జి పేరుతో ఆస్పత్రి ఉండటం ఏమిటని తక్షణం పేరు మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న లేదా తెన్నేటి విశ్వనాథం పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పేరు మార్చకపోతే కూల్చేస్తామన్న ప్రకటన మాత్రం ఆయన చేయలేదు. 


Also Read: ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్ నిర్ధారణ.. రాష్ట్రంలో 17కు చేరిన కేసులు


గుంటూరులోని జిన్నాటవర్ స్థూపం కాబట్టి .. కూల్చేస్తామని అసువుగా చెప్పారు కానీ..విశాఖలో ఉన్నది ఆస్పత్రి. ఉత్తరాంధ్ర పేద ప్రజలకు ఆరోగ్య ప్రదాయని. అందుకే కూల్చివేత అనే ఆలోచన కింగ్ జార్జ్ ఆస్పత్రి వద్దకు రానీయలేదు. కింగ్ జార్జ్ ఆస్పత్రికి దాదాపుగా రెండు 180 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటి సారిగా 1845లో డిస్పెన్సరీగా దీన్ని ప్రారంభించారు.  1857లో  30 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. అప్పట్నుంచి నిరంతరాయంగా ఆ ఆస్పత్రి అభివృద్ధి చెందుతూనే ఉంది. 1923లో  పానగల్ రాజ్, మద్రాస్ ముఖ్యమంత్రి కొత్త భవనాన్ని నిర్మించారు.  భారత్ విదేశీయుల పాలనలో ఉన్నప్పుడు.. అంటే స్వాతంత్రానికి పూర్వం కింగ్ జార్జ్ పరిపాలించేవారు. 


Also Read: గుంటూరులో టవర్ కు జిన్నా పేరు తొలగించాలి... బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్


ఆయన చివరి ఎంపరర్ ఆయన పేరు మీద ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఆయన పేరును తొలగించాలని ఇప్పటి వరకూ ఎవరూ డిమాండ్ చేయలేదు. సోము వీర్రాజు మొదటి సారిగా ఈ డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా  బీజేపీ నేతలు ముస్లిం రాజులు... ముస్లిం నేతల పేర్లను మాత్రమే తీసేయమని డిమాండ్ చేస్తూంటారు. ఏపీ బీజేపీ నేతలు ఈ రాజకీయాన్ని మరింత విస్తృతం చేసేందుకు కింగ్ జార్జ్ లాంటి పేర్లను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.  ఈ వాదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి  


Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్... !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి