తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలంలోని డిడ్గీ పద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న భార్యభర్తలు, 8 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని తీవ్రగాయాలయ్యి ఘటనాస్థలంలోనే మృతి చెందారు. బైకుపై వెళ్తోన్న దంపతులు అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు (28), శ్రావణి (22), చిన్నారి అమ్ములు (8 నెలలు)గా స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందాడు. సదరు వ్యక్తి వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు వాసి ఫరీద్‌ (25)గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 


Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి


విశాఖలో విషాదం


విశాఖలో న్యూ ఇయర్ రోజున విషాదం చోటు చేసుకుంది. ఆరిలోవ బీఆర్​టీఎస్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన రెండు బైకులు ఒకదానికొకటి బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. శనివారం బీఆర్​టీఎస్ రహదారిని తెరిచిన కొద్దిసేపటికే ఈ రోడ్డు ప్రమాదం జరగడం అందరిని దిగ్బ్రాంతికి గురిచేసింది. మృతుల్లో ఇద్దరు ఆరిలోవ ప్రాంతానికి చెందిన వారు, మరో ఇద్దరు వేపగుంట ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 


Also Read: తెలంగాణలో కిక్ ఎక్కించిన మద్యం అమ్మకాలు.. ఈ 5 రోజుల్లో మందుబాబులు అన్ని కోట్లు తాగేశారా..!  


నరసాపురం కాల్వలో పడిన బైక్ 


నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామ సమీపంలోని ప్రమాదవశాత్తు పంట కాలువలో  పడి యువకుడు మృతి చెందాడు. కొమరిక గ్రామానికి చెందిన కోట పవన్ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మైపాడు బీచ్ లో స్నేహితులతో కలిసి పార్టీ చేరుకున్నాడు. స్నేహితులతో సరదాగా గడిపిన పవన్ అర్ధరాత్రి దాటాక తన బైక్ పై సొంత గ్రామానికి బయలుదేరాడు. నరాసాపురం దాటగానే పంట కాలువకు ఉన్న సేఫ్టీ స్టోన్స్ ను ఢీకొని కాలువలో పడిపోయాడు. కాల్వ ఎక్కువ లోతు లేదు.  కానీ ఊపిరాడక అతను మృతి చెందాడు.  ఉదయం గ్రామస్తులు పొలాలకు వెళ్లేటప్పుడు గమనించి పక్కనే పడి ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని హాస్పటల్ కు తరలించారు. 


Also Read:  షేక్ పేట ఫ్లై ఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ కష్టాలు తీర్చనున్న రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి