సాంకేతిక పెరిగిన తర్వాత డిజిటల్ మనీ వినియోగం పెరిగింది. యూపీఐ బేస్డ్ యాప్ ల ద్వారా నగదు బదిలీలు పెరిగాయి. ఇప్పుడు సైబర్ కేటుగాళ్లు డిజిటల్ టెక్నాలజీతోనే మోసాలకు పాల్పడుతున్నారు. ఎనీ డెస్క్ యాప్ ద్వారా జరిగిన ఓ మోసం కడప జిల్లాలో బయటపడింది. ఎక్కడో బిహార్ లో ఉన్న వ్యక్తి కడప జిల్లాలోని వ్యక్తి నుంచి ఈ యాప్ ద్వారా రూ.2.76 లక్షలు కొట్టేశాడు.
'వీరబల్లిలో ఉండే పఠాన్ ముస్తాఫ్ ఖాన్ కు ఎస్బీఐ బ్యాంక్ ప్రతినిధి అంటూ ఓ కాల్ వచ్చింది. బ్యాంకులో మీ వివరాలు అప్డేడ్ చేస్తున్నాం. మీరు మాకు వివరాలు చెప్పక్కర్లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి వివరాలు నమోదుచేయాలన్నారు. బ్యాంక్ కాల్ అనుకుని ముస్తాఫ్ తన బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆ ఖాతా నుంచి విదేశాల్లోని ఈ-కామర్స్ సైట్లలో ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక్కొక్కటి రూ.50 వేల ఉన్న 5 ఫోన్లను కొన్నారు.' అని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
Also Read: చిన్నప్పుడు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేదని... ఇప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం
ఎనీ డెస్క్ యాప్ తో రూ.లక్షలు స్వాహా
ఎనీ డెస్క్ యాప్ తో ప్రజల బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి డబ్బులు కాజేస్తున్న సైబర్ కేటుగాడిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను కడప ఎస్పీ అన్బురాజన్ శుక్రవారం తెలిపారు. కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..వీరబల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పఠాన్ ముస్తాఫ్ ఖాన్ అకౌంట్ హ్యాక్ చేసి 2 లక్షల 76 వేల రూపాయల నగదు కొట్టేసిన సైబర్ నేరగాళ్లను బిహార్ లో అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. బిహార్ రాష్ట్రానికి చెందిన పుల్చువా విలేజ్ అనే సైబర్ నేరస్థుడిని వీరబల్లి ఎస్సై మహమ్మద్ రఫీ, సిబ్బంది అరెస్ట్ చేశారని తెలిపారు. వారి వద్ద నుంచి నేరం చేయడానికి ఉపయోగించిన మొబైల్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న పుల్చువా విలేజ్ కుమారుడు చందన్ అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. బిహార్ కు వెళ్లి ముద్దాయిలను అరెస్ట్ చేసిన వీరబల్లి ఎస్సై మహమ్మద్ రఫీ, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Also Read: నగరి వైఎస్ఆర్‌సీపీలో కోవర్టులు.. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి రోజా ఫిర్యాదు !
ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో ఏటీఎం దొంగతనాలకు పాల్పడిన బ్రహ్మంగారి మఠం చెందిన పెంచలయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. పెంచలయ్యపై జిల్లా వ్యాప్తంగా 16 కేసులు ఉన్నాయన్నారు. పలు ప్రాంతాల్లో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని రాజంపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారన్నారు. అతని వద్ద నుంచి 3 వేల నగదు, మొబైల్, దొంగతనానికి ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Also Read: అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులేమీ లేవు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్