భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌ నష్టాల్లోనే ముగిశాయి. గురువారం సూచీలకు అమ్మకాల సెగ తగిలింది. దాంతో పాటు పేటీఎం ఐపీవో హిట్టవ్వలేదు. 9 శాతం డిస్కౌంట్‌తో ఆ కంపెనీ షేర్లు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, ద్రవ్యోల్బణం భయాలు, యూఎస్‌ ఫెడ్‌ రేట్ల పెంపు వంటివి మదుపర్లపై ప్రభావం చూపించాయి. దాంతో ఉదయం ఫ్లాట్‌గా ఆరంభమైన సూచీలు భారీగా పతనం అయ్యాయి.


క్రితం రోజు 60,008 వద్ద ముగిసిన బీఎస్‌ఈ నేడు 59,968 వద్ద ఆరంభమైంది. 60,177 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మదుపర్లు విక్రయాలు చేపట్టడంతో ఇంట్రాడే కనిష్ఠమైన 59,423ను తాకింది. చివరికి 372 పాయింట్ల నష్టంతో 59,636 వద్ద ముగిసింది. క్రితం రోజు 17,898 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేటి ఉదయం 17,890 వద్ద మొదలైంది. 17,688 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 133 పాయింట్ల నష్టంతో 17,764 వద్ద ముగిసింది.


నష్టాలకు కారణాలు



  • ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐఓసీ, దివిస్‌ ల్యాబ్‌ లాభపడగా టాటా మోటార్స్, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ నష్టాల్లో ముగిశాయి.

  • గృహ నిర్మాణ డేటా విడుదల కావడంతో అమెరికా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, తగినంత మంది కార్మికులు లేకపోవడంతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. పైగా యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం ప్రకంపనల ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌ పతనం అయ్యాయి. భారత మార్కెట్లపై దీని ప్రభావం ఉంది.

  • యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు ఇంకా ఇన్వెస్టర్ల మనసుల్లోనే ఉన్నాయి. దాంతో సురక్షితమైన ప్రభుత్వ బాండ్లు, బంగారం, యెన్‌పై మదుపర్లులు పెట్టుబడులు పెట్టారు.

  • బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ ఆటో సూచీ 3 కన్నా ఎక్కువ శాతమే నష్టపోయింది. బీఎస్‌ఈ మెటల్‌, నిఫ్టీ ఐటీ రెండుకు పైగా నేలచూపులు చూశాయి


Also Read: Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత.. బిల్లు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! మరి ఆర్థిక లావాదేవీలు చెల్లుతాయా?


Also Read: Government Deposit Scheme: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి


Also Read: Petrol-Diesel Price, 18 November: వాహనదారులకు ఊరట.. ఇక్కడ స్థిరంగా ఇంధన ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి