By: ABP Desam | Updated at : 04 Oct 2023 01:27 PM (IST)
యెస్ బ్యాంక్ వడ్డీ ఆదాయాలు మారాయి
YES Bank FD Interest Rates: రెండు కోట్ల రూపాయల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను యెస్ బ్యాంక్ రివైజ్ చేసింది. మరో రెండు రోజుల్లో రెపో రేటుపై RBI ప్రకటన రానున్న నేపథ్యంలో యెస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్ల ప్రకారం... ఇప్పుడు 7 రోజుల నుంచి 120 నెలల డిపాజిట్ కాలపరిమితిపై సాధారణ ప్రజలకు 3.25% నుంచి 7.00% వరకు; సీనియర్ సిటిజన్లకు 3.75% నుంచి 7.75% వరకు వడ్డీ రేట్లను యెస్ బ్యాంక్ అందిస్తోంది. 18 నెలల నుంచి 24 నెలల పాటు ఉంచే డిపాజిట్లపై గరిష్టంగా 7.50% వడ్డీ ఆదాయాన్ని ఆఫర్ చేస్తోంది. కొత్త FD రేట్లు ఈ రోజు (బుధవారం, అక్టోబర్ 4, 2023) నుంచి అమలులోకి వచ్చాయి.
యెస్ బ్యాంక్ FD రేట్లు:
7 నుంచి 14 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25% వడ్డీ
15 నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.70% వడ్డీ
46 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉన్న డిపాజిట్లపై 4.10% వడ్డీ
91 రోజుల నుంచి 120 రోజుల వరకు ఉంచే డిపాజిట్లపై 4.75% వడ్డీ
121 రోజుల నుంచి 180 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.00% వడ్డీ
181 రోజుల నుంచి 271 రోజుల మధ్య ఉండే డిపాజిట్లపై 6.10% వడ్డీ
272 రోజుల నుంచి 1 సంవత్సరం కాల వ్యవధి FDలపై 6.35% వడ్డీ
1 సంవత్సరం 1 రోజు నుంచి 18 నెలల టెన్యూర్ డిపాజిట్ల మీద 7.25% వడ్డీ
18 నెలల 1 రోజు నుంచి 24 నెలల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7.50% వడ్డీ
24 నెలల 1 రోజు నుంచి 60 నెలల మధ్య కాల గడువుతో డిపాజిట్ చేస్తే 7.25% వడ్డీ
60 నెలల 1 రోజు నుంచి 120 నెలల వరకు ఇప్పుడు 7% వడ్డీ
సీనియర్ సిటిజన్లకు ప్రీమియం ఆఫర్
సాధారణ ప్రజలకు ఇచ్చే FD రేట్ల కంటే సీనియర్ సిటిజన్లకు (60 సంవత్సరాల పైబడి వాళ్లు) అర శాతం లేదా ముప్పావు శాతం ఎక్కువ వడ్డీని యెస్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు, రూ.5 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లను 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి డిపాజిట్ చేస్తే అదనంగా అర శాతం (0.50%), 3 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ కాలానికి డిపాజిట్ చేస్తే అదనంగా ముప్పావు శాతం (0.75%) వడ్డీ రేటును పొందుతారు.
యెస్ బ్యాంక్ బిజినెస్ అప్‌డేట్స్
సెప్టెంబర్ 30, 2023తో ముగిసే కాలానికి (Q2FY24) తాత్కాలిక బిజినెస్ అప్‌డేట్స్‌ను యెస్ బ్యాంక్ విడుదల చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలోని (Q2FY23) రూ.1,92,300 కోట్లతో పోలిస్తే, Q2FY24లో మొత్తం రుణాలు & అడ్వాన్సులు 9.5% పెరిగి రూ. 2,10,576 కోట్లకు చేరుకున్నాయి. డిపాజిట్లు గత ఏడాదిలోని రూ. 2,00,021 కోట్ల నుంచి 17.2% వృద్ధితో రూ. 2,34,360 కోట్లకు చేరుకున్నాయి.
త్రైమాసిక ప్రాతిపదికన, జూన్ త్రైమాసికంలో రుణాలు & అడ్వాన్సులు రూ. 2,00,204 కోట్ల నుంచి 5.2% పెరిగాయి. జూన్ త్రైమాసికం నుంచి డిపాజిట్లు 6.8% పెరిగి రూ.2,19,369 కోట్లకు చేరుకున్నాయి. YoY ప్రాతిపదికన, CASA (కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లు 11.1% వృద్ధితో రూ.62,073 కోట్ల నుంచి రూ.68,957 కోట్లకు పెరిగాయి. QoQలో, జూన్ త్రైమాసికంలోని రూ.64,568 కోట్ల నుంచి 6.8% వృద్ధి చెందాయి. YoY బేసిస్‌లో, మొత్తం డిపాజిట్లలో CASA నిష్పత్తి 31.3% నుంచి 29.4%కి కొంత తగ్గింది.
యెస్ బ్యాంక్ 'క్రెడిట్-టు-డిపాజిట్' రేషియో FY24 మొదటి త్రైమాసికంలో 91.3 శాతం & FY23 రెండో త్రైమాసికంలో 96.1%గా ఉంటే... FY24 రెండో క్వార్టర్‌లో 89.9%కు తగ్గింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: YES Bank FD Rates: యెస్ బ్యాంక్ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్ కంపెనీ జోస్యం!
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
AAA Rangoli Contest: ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్