By: ABP Desam | Updated at : 27 Jul 2023 01:12 PM (IST)
రిటర్న్ ఫైల్ చేయడంలో ఏదైనా ఇబ్బందా?
Troubles in Filing ITR: మీరు ఇప్పటికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఆదాయ పన్ను లెక్కలు సబ్మిట్ చేయడానికి కేవలం కొన్ని రోజులు సమయం మాత్రమే మిగిలుంది. ప్రస్తుత సీజన్‌లో ఐటీఆర్ ఫైలింగ్ గడువు (ITR Filing Deadline) 31 జులై 2023తో ముగుస్తుంది. ఈలోగా మీరు టాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
1 కోటి మంది ఇంకా బాకీ ఉన్నారు
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ప్రకారం, ఇప్పటి వరకు దాదాపు 11.50 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు, దాదాపు 4.50 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారు. గత ఏడాది దాదాపు 5.50 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. ఈ లెక్కన, దాదాపు కోటి మంది ఇప్పటికీ తమ ఆదాయాలను ప్రకటించలేదు. ఈ కోటి మందిలో మీరు కూడా ఉండి, రిటర్న్స్ ఫైల్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటుంటే, ఈ 5 మార్గాలు ట్రై చేసి చూడండి. ఇవి మీకు ఉపయోగపడతాయి.
1. JSON యుటిలిటీ: ఈ ఫెసిలిటీ ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆటో లాగ్ అవుట్ లేదా టైమ్ అవుట్ వంటి సమస్యలు మీకు ఎదురవుతుంటే, ఈ ఫెలిలిటీని ఉపయోగించుకోవచ్చు.
2. థర్డ్ పార్టీ వెబ్‌సైట్ లేదా ప్రొఫెషనల్: ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌కు ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి, రిటర్న్ ఫైల్ చేయడానికి థర్డ్ పార్టీ వెబ్‌సైట్ లేదా ట్యాక్స్ ప్రొఫెషనల్ సాయం తీసుకోవచ్చు. దీని వల్ల, ఫైలింగ్‌లో తప్పులు దొర్లే అవకాశం తగ్గుతుంది.
3. హెల్ప్‌లైన్స్: మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వస్తుంటే, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి, వాళ్ల నుంచి సాయం తీసుకోవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో ఎప్పుడైనా మీరు కాల్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లు... 1800 103 0025, 1800 419 0025, +91-80-46122000, +91-80-61464700. శనివారం రోజు కూడా ఈ నంబర్ల ద్వారా సాయం అందుతుంది. అయితే, ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సమయంలో మాత్రమే కాల్ చేయాలి.
4. హెల్ప్ సెంటర్: పన్ను చెల్లింపుదార్ల సమస్యలు పరిష్కరించేందుకు, కేంద్ర ప్రభుత్వం చాలా చోట్ల టాక్స్ పేయర్ హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సహాయ కేంద్రం మీకు దగ్గరలో ఎక్కడ ఉందో తెలుసుకుని, అక్కడకి వెళ్లి హెల్ప్ తీసుకోవచ్చు.
5. టాక్స్ ఫోరం & కమ్యూనిటీ: ప్రస్తుతం, చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా, ఇన్‌కమ్ టాక్స్ ఎక్స్‌పర్ట్స్ అందుబాటులో ఉంటున్నారు. వీళ్లు, ఆయా టాక్స్ ఫోరం, కమ్యూనిటీల్లోని మెంబర్లకు సాయం అందిస్తారు. ఈ తరహా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అయితే, ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే సమయంలో ఏది అసలు సైటో, ఏది నకిలీ సైటో తెలుసుకోవడం ముఖ్యం.
80 లక్షల మందికి రిఫండ్స్ జారీ
AY24లో, ఇప్పటి వరకు 4.5 కోట్ల మందికి పైగా ఐటీఆర్‌లు ఫైల్ చేశారు. వీళ్లలో, అర్హులైన 80 లక్షల మందికి పైగా రిఫండ్స్ జారీ అయ్యాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) లెక్కల ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు డివిడ్యువల్, కార్పొరేట్ డైరెక్ట్ టాక్స్‌లు రూ. 16.61 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2021-22తో పోలిస్తే ఈ మొత్తం 17.67 ఎక్కువ. ఐటీఆర్ ఈ-వెరిఫై చేసిన నాటి నుంచి గరిష్టంగా 16 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేస్తున్నట్లు CBDT ఛైర్‌పర్సన్ నితిన్ గుప్తా చెప్పారు.
మరో ఆసక్తికర కథనం: వరుసగా వచ్చి పడుతున్న షేర్ బైబ్యాక్స్, దీని వెనుక తిరకాసేమైనా ఉందంటారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Retirement Planning: మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడే ప్రారంభించండి - ఈ ఆప్షన్లతో కోట్ల కొద్దీ కూడబెట్టండి!
Gold-Silver Prices Today 01 Jan: నూతన సంవత్సరంలో షాక్ కొడుతున్న నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!
ITR Filing: పన్ను చెల్లింపుదార్లకు గుడ్ న్యూస్ - ITR ఫైలింగ్ గడువు పెంచిన టాక్స్ డిపార్ట్‌మెంట్
Gold-Silver Prices Today 31 Dec: నగలు కొనేవాళ్లకు న్యూ ఇయర్ గిఫ్ట్, భారీగా తగ్గిన బంగారం రేటు - ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవి
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు
Mahesh Babu: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
Bapatal District Crime News : తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం
Tirumala: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!