By: Arun Kumar Veera | Updated at : 04 Jan 2025 01:00 PM (IST)
అవసరానికి డబ్బులొచ్చే మార్గం పర్సనల్ లోన్ ( Image Source : Other )
Best Personal Loan Rates: ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లేదా స్కూల్ ఫీజ్ లేదా పెళ్లి పనులు వంటి వాటి కోసం అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే వ్యక్తిగత రుణం (Personal Loan) ఆదుకుంటుంది. పర్సనల్ లోన్‌లో ఉన్న అతి గొప్ప లక్షణం ఏమిటంటే.. నగదు అత్యంత వేగంగా అందుబాటులోకి వస్తుంది. దీని కోసం ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు లేదా సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, పర్సనల్ లోన్ తీసుకునేవాళ్లు ఎక్కువ వడ్డీ రేటు (Interest Rate Of Personal Loan) చెల్లించాలి. సాధారణంగా, పర్సనల్ లోన్ కోసం కార్ లోన్ (Car Laon) లేదా గృహ రుణం (Home Loan) కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాలి.
రుణం తీసుకునే ముందు ఈ విషయం గుర్తుంచుకోండి
ఇక్కడ, కొన్ని ప్రధాన ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు ఇస్తున్న వ్యక్తిగత రుణాలపై విధించిన వడ్డీ రేట్ల వివరాలు ఉన్నాయి. అయితే, వడ్డీ రేట్లు బ్యాంక్ నిర్ణయాలను బట్టి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కాబట్టి, వ్యక్తిగత రుణం తీసుకునే ముందు బ్యాంకుకు వెళ్లి వడ్డీ రేటు గురించి పూర్తి సమాచారం పొందండి. అంతేకాదు, పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకున్న వ్యక్తి క్రెడిట్ స్కోర్, ఆదాయ వనరులు వంటి అంశాలను బట్టి కూడా వడ్డీ రేటు మారుతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు ఎక్కువ వడ్డీ రేటు & ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేటుకు లోన్ దొరుకుతుంది.
పర్సనల్ లోన్‌పై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC bank) --- 10.85 నుంచి 24 శాతం వరకు
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI bank) --- 10.85 నుంచి 16.25 శాతం వరకు
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) --- 11.40 నుంచి 18.75 శాతం వరకు
కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) --- 10.99 నుంచి 16.99 శాతం వరకు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) --- 11.45 నుంచి 14.60 శాతం వరకు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) --- 12.40 నుంచి 17.95 శాతం వరకు
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) --- 10.49 నుంచి 22.50 శాతం వరకు
HDFC బ్యాంక్, దరఖాస్తుదారు ప్రొఫైల్ ఆధారంగా పర్సనల్ లోన్‌పై 10.85 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. దీంతో పాటు, జీఎస్టీ (GST)తో సహా బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 6,500 తీసుకుంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ 10.85 శాతం నుంచి 16.25 శాతం మధ్య వడ్డీని వసూలు చేస్తుంది & ప్రాసెసింగ్ రుసుమును 2 శాతం వరకు తీసుకుంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజుతో 10.99 నుంచి 16.99 శాతం వరకు వ్యక్తిగత రుణాలపై వడ్డీని రాబడుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తాను మంజూరు చేసే వ్యక్తిగత రుణాలపై 11.45 నుంచి 14.60 శాతం మధ్య వడ్డీని వసూలు చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సంవత్సరానికి 12.40 నుంచి 17.95 శాతం వడ్డీ తీసుకుంటుంది. యాక్సిస్ బ్యాంక్ 10.49 నుంచి 22.50 శాతం వరకు పర్సనల్ లోన్ వడ్డీని వసూలు చేస్తుంది.
ఈ నెలాఖరు వరకు, అంటే 31 జనవరి 2025 వరకు, ప్రభుత్వ బ్యాంకులు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజ్ వసూలు చేయలేవు. ప్రైవేట్ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజ్ కోసం లోన్ మొత్తంలో 2 శాతం వరకు తీసుకుంటాయి.
అప్లై చేసుకున్న ప్రతి వ్యక్తికి బ్యాంక్‌లు పర్సనల్ లోన్ మంజూరు చేయవు. దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్ (Credit Score), క్రెడిట్ హిస్టరీ (Credit History), ఆదాయ వనరులు, బ్యాంక్‌తో సంబంధాలు వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత లోన్ ఇవ్వాలో, వద్దో నిర్ణయిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: నగలు కొనేవాళ్లకు లక్కీ డే, రూ.4,900 తగ్గిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Punjab National Bank: కస్టమర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ - డిపాజిట్లపై మరింత ఎక్కువ డబ్బు చెల్లిస్తున్న PNB
Baanknet: 'బ్యాంక్‌నెట్' గురించి తెలుసా? - ఇల్లయినా, పొలమైనా, షాపయినా, ఎలాంటి ఆస్తినైనా చాలా చవకగా కొనొచ్చు!
Pension: పెన్షనర్లకు పెద్ద బహుమతి - దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ బ్యాంక్ నుంచయినా పెన్షన్
Gold-Silver Prices Today 04 Jan: నగలు కొనేవాళ్లకు లక్కీ డే, రూ.4,900 తగ్గిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
PF Balance Check: మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది?, ఇలా చెక్ చేయండి
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy