By: ABP Desam | Updated at : 28 Jan 2023 04:34 PM (IST)
Edited By: Arunmali
మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు
Sukanya Samriddhi Yojana: మీరు మీ కుమార్తె ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, సుకన్య సమృద్ధి యోజన ఒక గొప్ప పెట్టుబడి ఎంపిక అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆడపిల్లలమే ఈ పథకాన్ని (Investment of Girl Child) ప్రత్యేకంగా రూపొందించారు. 2014 నుంచి 2023 వరకు చూస్తే, ఈ పథకంపై వడ్డీ రేటు కొంత తగ్గింది. కానీ, రాబడి పరంగా ఈ పథకం ఇప్పటికీ ఇతర పథకాల కంటే మెరుగ్గా ఉంది.
దీర్ఘకాలిక పెట్టుబడి
చిన్న మొత్తాల పొదుపు పథకం తరహాలో సుకన్య సమృద్ధి యోజన పని చేస్తుంది. మీ కుమార్తె ఉన్నత చదువు, పెళ్లి కోసం భారీగా నిధులు (big corpus) కూడగట్టడంలో ఈ పథకం ద్వారా మీరు విజయం సాధించవచ్చు. 21 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కారణంగా, ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తారు. అలాగే, ఇది మీ కుమార్తె గాక మీకు కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
2014లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు అందుతున్న వడ్డీ గరిష్ట స్థాయి నుంచి 1.6 శాతం తగ్గింది. అయినా, చిన్న మొత్తాల పొదుపులోని అత్యంత ఆకర్షణీయమైన పథకాల జాబితాలో ఇది ఇప్పటికీ ఉంది. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టిన పెట్టుబడి మీద మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే, దాని నుంచి వచ్చే రాబడి కూడా పన్ను రహితం. అదే సమయంలో, పెట్టుబడి 15 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఆరు సంవత్సరాల కాలానికి కూడా మీరు ప్రభుత్వం నుంచి మంచి వడ్డీని పొందుతారు.
సుకన్య సమృద్ధి యోజన 2014లో సామాన్య ప్రజల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏప్రిల్ 1, 2014న 9.1 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరుసటి ఏడాది ఏప్రిల్ 1, 2015 నాటికి 9.2 శాతానికి పెంచింది. 2018లో ప్రభుత్వం దానిని 8.5 శాతానికి కుదించింది. ఆ తరువాత, ఇది 31 మార్చి 2020న 8.4 శాతంగా ఉంది. 30 జూన్ 2020తో ముగిసే త్రైమాసికంలో ఇది 7.6 శాతానికి తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే 2023లోనూ ఈ పథకం మీద 7.6 శాతం వడ్డీ అందుతోంది.
3 మార్గాల్లో పన్ను మినహాయింపు
సుకన్య సమృద్ధి యోజన ఒక పన్ను రహిత పథకం. మీరు దీని మీద 3 వేర్వేరు స్థాయుల్లో పన్ను మినహాయింపు పొందుతారు. మొదటి మార్గం... ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C (Section 80C of the Income Tax Act) కింద రూ. 1.50 లక్షల వార్షిక పెట్టుబడికి మినహాయింపు ఉంది. రెండో మార్గం... ఈ పథకం ద్వారా వచ్చే రాబడి మీద పన్ను లేదు (Free Tax on Returns). మూడో మార్గం... మెచ్యూరిటీ సమయంలో అందుకున్న మొత్తం కూడా పన్ను రహితం Tax Free Maturity).
మూడు రెట్ల రాబడి
ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజనలో వడ్డీ రేటు సంవత్సరానికి 7.6 శాతం. దీని మెచ్యూరిటీ 21 ఏళ్లయినా, పెట్టుబడి వ్యవధి మాత్రం 15 సంవత్సరాలు మాత్రమే. మిగిలిన కాలానికి కూడా వడ్డీ పొందుతారు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం కంటే మెచ్యూరిటీ రాబడి 3 రెట్లు వరకు ఉంటుంది. మీరు ఏడాదికి గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేస్తే, ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం, మెచ్యూరిటీ తేదీన రూ. 64 లక్షల వరకు చేతికి వస్తుంది.
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Falcon MD Amardeep Arrest: డిజిటల్ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్ అరెస్ట్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో