search
×

SGB Scheme: పసిడిలో పెట్టుబడికి గోల్డెన్‌ ఛాన్స్‌ - త్వరలోనే మరో 2 విడతల్లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌

మరో రెండు విడతల్లో సావరిన్ గోల్డ్ బాండ్లను (SGBs) కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.

FOLLOW US: 
Share:

Sovereign Gold Bond Scheme: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లకు గోల్డెన్‌ న్యూస్‌. అతి తర్వలోనే మంచి పెట్టుబడి అవకాశం రాబోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24), మరో రెండు విడతల్లో సావరిన్ గోల్డ్ బాండ్లను (SGBs) కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.

2023 జూన్‌ 19-23 తేదీల్లో ఫస్ట్‌ సిరీస్‌, సెప్టెంబర్‌ 11-15 తేదీల్లో సెకండ్‌ సిరీస్‌లో SGBలు జారీ అయ్యాయి. ఇప్పుడు, మూడో విడతలో డిసెంబర్‌ 18-22 తేదీల్లో, నాలుగో విడతలో 2024 ఫిబ్రవరి 12-16 తేదీల్లో బాండ్లు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ఈ బాండ్లను జారీ చేస్తుంది.

గోల్డెన్‌ ఛాన్స్‌
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ ద్వారా 999 కేరట్ల స్వచ్ఛమైన బంగారాన్ని తక్కువ రేటుకే కొనొచ్చు. 2023-24 మొదటి విడతలో ఒక్కో గ్రాము బంగారాన్ని రూ. 5,926 చొప్పున అమ్మిన కేంద్రం ప్రభుత్వం, రెండో విడతలో ఇష్యూ ప్రైస్‌ను ఒక్కో గ్రాముకు రూ.5,923 గా నిర్ణయించింది. 

మూడు, నాలుగు సిరీస్‌ల బంగారం రేటును ఇప్పుడే నిర్ణయించరు. సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీకి ముందున్న మూడు పని దినాల్లో, 999 కేరట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా ఇష్యూ ప్రైస్‌ను నిర్ణయిస్తారు. ఆయా రోజుల్లో 'ఇండియా బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌' నిర్ణయించిన ధరలను ప్రామాణికంగా తీసుకుంటారు.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి? (What is Sovereign Gold Bond Scheme?)
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు. సావరిన్ గోల్డ్ బాండ్‌ అనేది డిజిటల్‌ బంగారం. భౌతికంగా కనిపించదు. ఫిజికల్‌ గోల్డ్‌ను ఇంట్లో ఉంచుకుంటే దొంగల భయం సహా రకరకాల రిస్క్‌లు ఉంటాయి. ఈ ఇబ్బందులను తప్పించడంతో పాటు భౌతిక బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపరచడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB Scheme). 

ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ (Rs.50 discount per gram in SGB)
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో బంగారాన్ని బాండ్‌ రూపంలో ఇష్యూ చేస్తారు. ఒక బాండ్‌ ఒక గ్రాము బంగారానికి సమానం. బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసి, డిజిటల్‌ మోడ్‌లో డబ్బులు చెల్లిస్తే ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. 

సావరిన్ గోల్డ్ బాండ్ కాల పరిమితి (Sovereign Gold Bond Tenure)
ఒక్కో గోల్డ్‌ బాండ్‌ కాల పరిమితి 8 సంవత్సరాలు. బాండ్ హోల్డర్‌ కోరుకుంటే, ఈ బాండ్లను 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్‌ చేసుకోవచ్చు. ఆ రోజున ఉన్న రేటుకు బాండ్లను సరెండర్‌ చేయవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వల్ల ఏంటి లాభం? (benefit of sovereign gold bonds)
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(కూపన్‌ రేట్‌) వడ్డీ చెల్లిస్తారు. బాండ్‌ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ వడ్డీని 6 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. భౌతిక బంగారం కొనుగోలులో వర్తించే మేకింగ్‌, జీఎస్టీ వంటి అదనపు బాడుదు గోల్డ్‌ బాండ్లకు ఉండదు. 

TDS ఉండదు (No TDS on Sovereign Gold Bonds)
SGBలను రిడీమ్‌ చేసుకున్నప్పుడు వచ్చే డబ్బుకు TDS (Tax Deducted at Source) వర్తించదు.

SGBలపై ఆదాయ పన్ను (Tax on SGBs)
కొన్న తేదీ నుంచి మూడేళ్ల ముందు SGBలను అమ్మితే వచ్చే డబ్బు స్వల్పకాలిక మూలధన లాభాల కిందకు వస్తుంది, వ్యక్తిగత ఆదాయానికి యాడ్‌ అవుతుంది. ఆదాయ పన్ను వర్తించే శ్లాబ్‌ సిస్టమ్‌ ప్రకారం పన్ను చెల్లించాలి. 3 సంవత్సరాల తర్వాత అమ్మితే దీర్ఘకాలిక మూలధన లాభాల కింద (ఇండెక్సేషన్‌ ప్రయోజనం అనంతరం) టాక్స్‌ కట్టాలి.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎలా కొనాలి? (How to buy Sovereign Gold Bonds?)
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SHCIL)‍, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలు పొందొచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎవరు కొవనచ్చు? (Who can buy Sovereign Gold Bonds?)
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్‌ లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.

ఎంత బంగారం కొనవచ్చు? (How much gold can you buy?)
గోల్డ్‌ బాండ్‌ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు (Hindu Undivided Family) కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.

ఫిజికల్‌ గోల్డ్ కొనే సమయంలో వర్తించే KYC (Know your customer) రూల్సే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ విషయంలోనూ వర్తిస్తాయి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Published at : 09 Dec 2023 10:21 AM (IST) Tags: Gold scheme Interest Rate Sovereign Gold Bonds SGB Investment in Gold gold Investment tips

ఇవి కూడా చూడండి

Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?

Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?

Gold-Silver Prices Today 19 Nov: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్‌ రష్‌, సిల్వర్‌ షైనింగ్‌' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 19 Nov: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్‌ రష్‌, సిల్వర్‌ షైనింగ్‌' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Stock Market Trading: ట్రేడింగ్‌లో రూ.50 లక్షల కోట్ల నష్టం - ఈ 5 తప్పులతో 'శని'ని రెడ్‌ కార్పెట్‌ వేసి పిలిచినట్లే!

Stock Market Trading: ట్రేడింగ్‌లో రూ.50 లక్షల కోట్ల నష్టం - ఈ 5 తప్పులతో 'శని'ని రెడ్‌ కార్పెట్‌ వేసి పిలిచినట్లే!

Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్‌ - ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వార్నింగ్‌

Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్‌ - ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వార్నింగ్‌

High Interest: ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ

High Interest: ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ

టాప్ స్టోరీస్

Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం

Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం

Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్

Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్

RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు

RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు

YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు