By: Arun Kumar Veera | Updated at : 08 Apr 2024 02:45 PM (IST)
స్పెషల్ స్కీమ్ అమృత్ కలశ్ గడువు పెంచిన స్టేట్ బ్యాంక్
SBI Amrit Kalash Scheme Details In Telugu: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్, తాను రన్ చేస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం (State Bank FD) 'అమృత్ కలశ్' గడువును మరోమారు పెంచింది. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయాన్ని SBI ఆఫర్ చేస్తోంది.
అమృత్ కలశ్ స్కీమ్ గడువును మరో ఆరు నెలల పాటు బ్యాంక్ పొడిగించింది. అంటే, ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉంది. గతంలో ఉన్న లాస్ట్ డేట్ ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. వాస్తవానికి, అమృత్ కలశ్ గడువును ఇప్పటికే స్టేట్ బ్యాంక్ చాలాసార్లు పెంచింది.
అమృత్ కలశ్ పథకంపై వడ్డీ రేటు, ఇతర వివరాలు
SBI అమృత్ కలశ్ పథకం టెన్యూర్ 400 రోజులు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బు జమ చేసిన సీనియర్ సిటిజన్లకు ఏటా 7.60 శాతం వడ్డీ రేటు (SBI Amrit Kalash Scheme Interest Rate) అందుతుంది. సాధారణ పౌరులకు ఏడాదికి 7.10 శాతం వడ్డీ రేటును బ్యాంక్ జమ చేస్తుంది.
రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. అంటే, రూ.2 కోట్ల లోపు మొత్తంతో ఎఫ్‌డీ వేయాలనుకున్న అందరూ దీనికి అర్హులే. కొత్తగా ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.
ఒకవేళ మీకు హఠాత్తుగా డబ్బు అవసరమైనా, 400 రోజుల కంటే ముందే అమృత్ కలశ్ ఖాతాను రద్దు చేసుకోవాలనుకున్నా.. మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే అకౌంట్‌ను క్లోజ్ చేసే (Amrit Kalash premature withdrawal) సదుపాయం ఉంది. ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.
అమృత్ కలశ్ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఇన్‌కం టాక్స్ యాక్ట్ (Income Tax Act) రూల్స్ ప్రకారం TDS కట్ అవుతుంది. ఇలా కట్ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే (ITR Filing) సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
మీకు పెట్టుబడి ఆలోచన ఉంటే.. నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద అవగాహన ఉంటే, బ్రాంచ్ వరకు వెళ్లక్కర్లేకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేస్తుకోవచ్చు. ఇందుకోసం, మీకు SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మీ ఫోన్‌లో యోనో (SBI YONO) యాప్ ఉంటే చాలు. మీరు ఇంట్లోనే కూర్చుని ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో ద్వారా ఎస్‌బీఐ అమృత్ కలశ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
స్టేట్ బ్యాంక్ నిర్వహిస్తున్న వివిధ రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. 2 కోట్ల రూపాయల లోపు డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు 3.50 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. గరిష్ఠంగా 7 శాతం వడ్డీ (అమృత్ కలశ్ కాకుండా) లభిస్తుంది. అన్ని పథకాల్లో సీనియర్ సిటిజన్లకు మరో పావు శాతం నుంచి అర శాతం (0.25 శాతం నుంచి 0.50) వరకు అదనపు వడ్డీ ఆదాయం లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఉగాది రోజున స్టాక్ మార్కెట్‌కు సెలవు ఇచ్చారా, పని చేస్తుందా?
Saving Ideas: రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్ చేసుకోండి
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Gold-Silver Prices Today 02 Nov: పండుగ తర్వాత పసిడి రేట్ల పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Holidays: ఈ నెలలో బ్యాంక్‌లు 12 రోజులు సెలవుల్లోనే ఉంటాయి, మీకేదైనా ముఖ్యమైన పని ఉందా?
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Upcoming Cars Bikes in November: నవంబర్‌లో లాంచ్ కానున్న కార్లు, బైక్‌లు ఇవే - రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి స్కోడా కైలాక్ వరకు!