By: Arun Kumar Veera | Updated at : 29 Jun 2024 09:15 AM (IST)
పోస్టాఫీస్ పథకాలపై పైసా కూడా పెరగని వడ్డీ రేట్లు
Small Saving Schemes Interest Rates: కేంద్ర ప్రభుత్వం, చిన్న పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న సామాన్య ప్రజలకు మరోమారు నిరాశను మిగిల్చింది. ఇలా చేయడం ఇది వరుసగా రెండోసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్ కాలం)... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) సహా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ సేవింగ్స్ స్కీమ్‌ల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యాలయం మెమోరాండం జారీ చేసింది. అంటే, 2024-25 తొలి త్రైమాసికంలోని (ఏప్రిల్-జూన్ కాలం) వడ్డీ రేట్లనే రెండో త్రైమాసికంలోనూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయి.
వడ్డీ రేటు పెరుగుతుందని ఆశించిన పీపీఎఫ్ పెట్టుబడిదార్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం చాలా నిరాశపరిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఇది తప్ప, గత ఏడాదిన్న కారంలో మిగిలిన పథకాల్లో వడ్డీ రేట్లను సర్కారు పెంచింది.
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు (Small Saving Scheme Interest Rates From 01 July - 30 September 2024)
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana Interest Rate) వడ్డీ రేటు ------ 8.20 శాతం
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS Interest rate) వడ్డీ రేటు ------ 8.20 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC Interest rate) వడ్డీ రేటు ------ 7.70 శాతం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Interest rate) వడ్డీ రేటు ------ 7.10 శాతం
కిసాన్ వికాస్ పత్ర (KVP Interest rate) వడ్డీ రేటు ------ 7.50 శాతం (115 నెలల మెచ్యూరిటీ కాలం)
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS Interest rate) వడ్డీ రేటు ------ 7.40 శాతం
పొదుపు ఖాతా వడ్డీ రేటు (Savings Scheme Interest rate) ------ 4.00 శాతం
1 సంవత్సరం టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు ------ 6.90 శాతం
2 సంవత్సరాల కాల డిపాజిట్ వడ్డీ రేటు ------ 7.00 శాతం
3 సంవత్సరాల కాల డిపాజిట్ వడ్డీ రేటు ------ 7.10 శాతం
5 సంవత్సరాల కాల డిపాజిట్ వడ్డీ రేటు ------ 7.50 శాతం
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు ------ 6.70 శాతం
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold Investment: స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు
Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోయిందా?, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా డూప్లికేట్ ఆధార్ కార్డ్ పొందొచ్చు
LIC Kanyadan Policy: మీ కుమార్తె భవిష్యత్ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!
Gold-Silver Prices Today 16 Feb: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Inactive Credit Card: క్రెడిట్ కార్డ్‌ను పక్కన పడేశారా? - మీ క్రెడిట్ స్కోర్ మీ చేతులారా పాడు చేసుకుంటున్నట్లే!
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!