By: ABP Desam | Updated at : 03 Jan 2023 01:24 PM (IST)
Edited By: Arunmali
ఆధార్ ద్వారా NPS ఖాతా తెరవడం ఈజీ ఇప్పుడు
NPS Account: కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది కొత్త నిర్ణయాలు తీసుకుని, అమలు చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా, మీ పదవీ విరమణ (Retirement Plan) కోసం ప్లాన్ చేస్తుంటే, NPS ఒక మంచి ఎంపిక.
దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టే అవకాశాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System - NPS) ఇస్తుంది. ఇందులో, ఇప్పటి నుంచి చిన్న మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో డబ్బును తిరిగి అందుకోవచ్చు. NPSలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 50,000 వరకు పింఛను (Pension) పొందవచ్చు.
NPS ఖాతా ఓపెన్ చేయడానికి మీరు సమయాన్ని వృథా చేసుకుని ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. దర్జాగా ఇంట్లో కూర్చొనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అలాగే, ఆధార్ సహాయంతో NPS ఖాతాను తెరవవచ్చు. NPS ఖాతా తెరవడానికి ముందు, అసలు NPS పథకం (NPS Scheme) కింద మీకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో ముందు చూద్దాం.
NPS ప్రయోజనాలు ఏంటి?
NPS పథకంలో పెట్టుబడి పెట్టే మొత్తాలకు మీకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 CCD (1B) కింద రూ. 50 వేలు & ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మీరు మినహాయింపును పొందవచ్చు. అంటే, ఈ నిర్దిష్ట మొత్తానికి మీరు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. NPS ఖాతా గడువు ముగియగానే (Maturity Period) మీకు భారీ మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. NPS పథకం ద్వారా డబ్బు అందుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గంలో, ఫండ్ మొత్తం మీకు అందుతుంది. రెండో మార్గంలో, పెన్షన్ కోసం డబ్బు డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుతో యాన్యుటీని కొనుగోలు చేసి, ప్రతి నెలా లెక్క ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు.
500 రూపాయలతో ఖాతా తెరవవచ్చు
NPS కింద రెండు రకాల ఖాతాలు తెరవడానికి వీలుంది. ఎవరైనా పేరు రిజిస్టర్ చేసుకుని టైర్ 1లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. రూ. 500తోనూ ఈ ఖాతా తెరవవచ్చు. టైర్ 2 కోసం, మీరు తప్పనిసరిగా టైర్ 1 ఖాతాను కలిగి ఉండాలి. టైర్ 2 ఖాతాలో ప్రతి నెలా డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా, రిటైర్మెంట్ సమయానికి మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మెచ్యూరిటీ ముగియగానే మీరు 60% మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు, మిగిలిన 40% మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయవచ్చు. ఇది పెన్షన్‌గా ఉపయోగపడుతుంది.
ఆధార్‌తో NPS ఖాతాను ఎలా తెరవాలి?
ముందుగా, NSDL enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్‌సైట్‌కి వెళ్లండి.
ఇప్పుడు రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేసి, ఆ తర్వాత రిజిస్టర్డ్ విత్ ఆధార్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత, మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేయడం ద్వారా మొబైల్ నంబర్‌ను ధృవీకరించండి.
ఆధార్ సంబంధిత సమాచారం ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతుంది, దానిని మీరు పూరించాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు స్కాన్ చేసిన సంతకం, మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి.
నగదు చెల్లింపు తర్వాత, మీ NPS ఖాతా ఓపెన్ అవుతుంది.
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం