search
×

New Pension Vs Old Pension: ఓపీఎస్‌, ఎన్‌పీఎస్‌లో ఏది బెస్ట్‌! రెండింట్లో తేడాలేంటి - ఎక్కువ డబ్బు ఎందులో పొందొచ్చు!

NPS vs OPS: కొన్నాళ్లుగా ఓల్డ్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (OPS), న్యూ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) వ్యవస్థలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అసలీ రెండు విధానాల మధ్య తేడా ఏంటి? ప్రయోజనాలు ఏంటి?

FOLLOW US: 
Share:

New Pension Vs Old Pension:

కొన్నాళ్లుగా ఓల్డ్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (OPS), న్యూ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) వ్యవస్థలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు పాత పింఛన్‌ పద్ధతి వైపు మళ్లాయి. రాజకీయ దుమారం పక్కన పెడితే అసలీ రెండు విధానాల మధ్య తేడా ఏంటి? ఎప్పట్నుంచి ఇది మారింది? ప్రయోజనాలు ఏంటి?

2004 నుంచి ఎన్‌పీఎస్‌

ఓపీఎస్‌ పింఛను ఆధారిత వ్యవస్థ. 2003లో ఎన్‌డీఏ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. ఉద్యోగులకు సరికొత్త పింఛను పథకం తీసుకొచ్చింది. 2004, ఏప్రిల్‌ 1 నుంచి పింఛను, పెట్టుబడి ఆధారిత పథకం ఆరంభించింది. ఇందులో కొంత డబ్బును స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. రిటైర్‌ అయ్యాక ఎక్కువ మొత్తం అందించే లక్ష్యంతోనే ఇలా చేశారు. ఉద్యోగి నష్టభయాన్ని అనుసరించే పెట్టుబడి విధానాలు ఉంటాయి.

OPS ప్రయోజనాలు

  • పాత పింఛను వ్యవస్థలో ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యాక ప్రతి నెలా నిర్దేశించిన మొత్తం పింఛను రూపంలో వస్తుంది.
  • చివరి సారి తీసుకున్న జీతంలో సగం పింఛనుగా పొందుతారు.
  • ఉద్యోగులకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు.
  • ఓపీఎస్‌లో ఎలాంటి పన్ను అమలు చేయరు.
  • ఈ వ్యవస్థలో చేరేందుకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అవకాశం ఉంటుంది.

NPS ప్రయోజనాలు

  • కొత్త పింఛను వ్యవస్థనూ ప్రభుత్వ ఉద్యోగుల కోసమే తీసుకొచ్చారు. అయితే ప్రైవేటు ఉద్యోగులూ ఇందులో చేరొచ్చు.
  • ఉద్యోగం చేస్తున్నంత వరకు నెలవారీ జీతం నుంచే ఎన్‌పీఎస్‌లో కంట్రిబ్యూట్‌ చేస్తారు. ఆ మొత్తాన్ని మార్కెట్‌ అనుబంధ సాధనాల్లో పెట్టుబడిగా పెడతారు.
  • ఆదాయ పన్నులో సెక్షన్‌ 80C కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయించుకోవచ్చు. సెక్షన్‌ 80CCD (1B) కింద రూ.50,000 వరకు అదనపు పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది.
  • ఉద్యోగి రిటైర్‌ అయ్యాక మొత్తం ఫండ్‌ నుంచి కొంతమేర విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం మెచ్యూరిటీ తర్వాత 60 శాతం కార్పస్‌పై పన్ను ఉండదు. మిగిలిన 40 శాతంపై పన్ను విధిస్తారు. అయితే మిగిలిన 40 శాతం డబ్బుతో ఆన్యూటీ ప్లాన్‌ కొనుగోలు చేసుకోవాలి. దాన్నుంచి ప్రతి నెలా పింఛను ఇస్తారు.
  • 2004 నుంచి సైనిక దళాలను మినహాయించి కేంద్ర ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ దీనినే వర్తింపజేస్తున్నారు.
  • ఎన్‌పీఎస్‌లో వేతనంలో 10 శాతం వరకు నెలవారీ కంట్రిబ్యూషన్‌ చేయాలి. ప్రభుత్వమూ సమానంగా కంట్రిబ్యూట్‌ చేస్తుంది. 2019 నుంచి కంట్రిబ్యూషన్‌ రేట్‌ను 14 శాతానికి పెంచారు.
  • 18-65 ఏళ్ల మధ్య వయస్కులు ఎన్‌పీఎస్‌ పథకంలో చేరేందుకు అర్హులు.

Published at : 26 Nov 2022 05:27 PM (IST) Tags: NPS Old Pension Scheme central govt employees OPS NPS vs OPS New Pension Scheme

ఇవి కూడా చూడండి

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్‌ కోసం అప్లై చేయడం ఇప్పుడు ఈజీ, బ్యాంక్‌ ఆ పనిని సింపుల్‌గా మార్చింది

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్‌ కోసం అప్లై చేయడం ఇప్పుడు ఈజీ, బ్యాంక్‌ ఆ పనిని సింపుల్‌గా మార్చింది

ITR 2024: ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?

ITR 2024: ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?

Post Office Schemes: పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా ప్రారంభించే ముందు ఈ రూల్స్‌ తెలుసుకోండి

Post Office Schemes: పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా ప్రారంభించే ముందు ఈ రూల్స్‌ తెలుసుకోండి

Latest Gold-Silver Prices Today: యుద్ధ భయంతో పసిడికి రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: యుద్ధ భయంతో పసిడికి రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices Today: తగ్గిన పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: తగ్గిన పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!

North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన

North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !

Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?

Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?