search
×

Cibil Score Drops: బీ కేర్‌ఫుల్ ! ఈ చిన్న తప్పుతో సిబిల్‌ స్కోరు 100 పాయింట్లు ఢమాల్‌!

Cibil Score: విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఎంచుకొనే ఆప్షన్‌ వన్‌టైమ్‌ లోన్ సెటిల్‌మెంట్‌. కానీ దీనివల్ల అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడే అంటున్నారు విశ్లేషకులు.

FOLLOW US: 
Share:

Cibil Score: నిర్దేశిత కాలపరిమితి లోపే రుణాలు తీర్చేయాలని అందరూ అనుకుంటారు! ఎడతెగని ఇబ్బందులతో కొన్నిసార్లు అలా కట్టలేకపోవచ్చు. కరోనా, ఉద్యోగం పోవడం, ప్రమాదానికి గురవ్వడం వంటి విపత్తులతో గడువు తీరినా అప్పు తీర్చే స్తోమత ఉండదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఎంచుకొనే ఆప్షన్‌ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌. కానీ దీనివల్ల అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడే!!

ప్రాసెస్ ఏంటి?

ఉదాహరణకు ఐదేళ్ల కాల పరిమితితో విశ్వ రూ.5 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం! మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించారు. హఠాత్తుగా కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఆరు నెలల వరకు ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ సమయంలో ఆదా చేసుకున్న డబ్బులన్నీ ఇంటి ఖర్చులకే సరిపోయాయి. ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆమె బ్యాంకు అధికారుల్ని సంప్రదించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ను (Loan Settlement) ఆఫర్‌ చేశారు. తక్కువ డబ్బుతోనే రుణం తీరిపోతుందని విశ్వ సంతోషించారు. రోజులు గడిచాయి. జీవితం సాధారణ స్థితికి చేరుకోవడంతో లోన్‌ తీసుకొని కారు కొందామని అనుకున్నారు. బ్యాంకుకు వెళ్లాక లోన్‌ నిరాకరించడంతో షాకవ్వడం ఆమె వంతైంది.

ఏడేళ్ల వరకు రికార్డు

వన్‌టైమ్‌ సెటిల్‌మెంటు మరో కొత్త రుణానికి నడుమ చాలా ప్రాసెస్‌ జరుగుతుంది. కస్టమర్ పరిస్థితిని అర్థం చేసుకొని ఎంతో కొంత కట్టించుకున్న బ్యాంకు ఆ రుణాన్ని పుస్తకాల నుంచి తొలగిస్తుంది. అంటే రైటాఫ్‌ చేస్తుంది. ఆ తర్వాత లోన్‌ క్లోజ్‌ (Loan Close) అవ్వలేదని సెటిల్‌ చేసుకున్నారని బ్యాంకు అధికారులు సిబిల్‌కు (Cibil) తెలియజేస్తారు. ఆ సంస్థ దీనిని లావాదేవీగా గుర్తించదు. ఫలితంగా కస్టమర్‌ సిబిల్‌ స్కోరు (Cibil Score) 75-100 పాయింట్ల మేర పడిపోతుంది. ఏడేళ్ల వరకు సిబిల్‌ ఈ రికార్డును భద్రపరుస్తుంది. ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వాలంటే చూసేది సిబిల్‌ స్కోరు, కస్టమర్‌ క్రెడిట్‌ బిహేవియర్‌. సెటిల్‌మెంట్‌ సమయంలో ఈ రెండు అంశాల్లో నెగెటివ్‌ రిమార్క్‌ పడుతుంది. అందుకే బ్యాంకులు రుణాల్ని నిరాకరిస్తాయి. 

ఆఖరి అవకాశంగానే

ఇలాంటి పరిస్థితుల్లో లోన్‌ సెటిల్‌మెంట్‌ను చివరి అవకాశంగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రుణం తీర్చలేని పరిస్థితే ఎదురైతే మీ పోర్టుపోలియోలోని ఆస్తుల్లో కొంత భాగం అమ్మి డబ్బు కట్టడం మంచిది. లేదంటే మిత్రులు లేదా బంధువుల సాయం కోరవచ్చు. అదీ కుదరని పక్షంలో లోన్‌ గడువును పెంచాలని బ్యాంకు అధికారులను కోరాలని నిపుణులు అంటున్నారు. వడ్డీ మినహాయించి అసలు తీర్చేందుకు అవకాశమివ్వాలని కోరినా ఫర్వాలేదు. ఇందులో ఏవీ జరగకపోతేనే వన్‌టైమ్‌ సెటిల్‌మెంటుకు వెళ్లాలని విశ్లేషకులు చెబుతున్నారు. సెటిల్‌మెంటు పూర్తవ్వగానే సిబిల్‌ స్కోరు ఎలా ఉందో తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ స్కోరు తగ్గితే పెంచుకొనేందుకు 12-24 నెలల పాటు కష్టపడాల్సి ఉంటుందని చెప్తున్నారు.

Published at : 16 Jul 2022 10:21 AM (IST) Tags: personal finance CIBIL Loan Settlement CIBIL Score loan emi

ఇవి కూడా చూడండి

Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ

Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ

Gold-Silver Prices Today: పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పసిడి - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పసిడి - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Citi Bank: సిటీ బ్యాంక్‌ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు మారాక మీ రివార్డ్ పాయింట్స్‌ ఏమవుతాయి?

Citi Bank: సిటీ బ్యాంక్‌ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు మారాక మీ రివార్డ్ పాయింట్స్‌ ఏమవుతాయి?

Budget 2024: మీ పొదుపు ఖాతాపై నిర్మల సీతారామన్‌ నుంచి గిఫ్ట్‌ - రూ.25,000 వేల వరకు రాయితీ!

Budget 2024: మీ పొదుపు ఖాతాపై నిర్మల సీతారామన్‌ నుంచి గిఫ్ట్‌ - రూ.25,000 వేల వరకు రాయితీ!

Gold-Silver Prices Today: భారీగా పెరిగిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: భారీగా పెరిగిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్

Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!

Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!

Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం

Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం

Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!

Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!