By: ABP Desam | Updated at : 02 Jul 2023 10:26 AM (IST)
₹25 లక్షలు సంపాదించాలంటే రోజుకు ₹45 పెట్టుబడి చాలు!
LIC New Jeevan Anand Policy: ప్రభుత్వ రంగ బీమా కంపెనీ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' (LIC), దేశంలోని ప్రతి జనాభా వర్గం అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు వివిధ పథకాలను ప్రకటిస్తుంటుంది. వాటిలో కొన్ని హిట్ అవుతాయి, మరికొన్ని ఫట్ అవుతాయి. LIC పాలసీల్లో బాగా పాపులర్ అయిన ఒక స్కీమ్ ఉంది. దాని పేరు LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ (LIC New Jeevan Anand Policy). లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా కాలం నుంచి దీనిని కంటిన్యూ చేస్తోంది. ఇటీవలే, ఈ పాలసీ కొత్త వెర్షన్‌ను కూడా లాంచ్ చేసింది.
LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ డిటెయిల్స్:
LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అనేది పార్టిసిపేటింగ్ హోల్ లైఫ్ ఎండోమెంట్ ప్లాన్. దీనిలో, పెట్టుబడిదార్లు సేవింగ్ బెనిఫిట్స్ ప్లస్ జీవిత లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ రెండింటినీ పొందుతారు. ఇది LIC జీవన్ ఆనంద్ కొత్త వెర్షన్ అని గుర్తుంచుకోండి. ఇందులో చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ, దీర్ఘకాలంలో బలమైన రాబడి పొందవచ్చు. హామీతో కూడిన రాబడితో పాటు అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి. రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో కస్టమర్‌కు 100 సంవత్సరాల వయస్సు వరకు లైఫ్ కవరేజ్ బెనిఫిట్ లభిస్తుంది.
ఈ స్కీమ్ కోసం కట్టే డబ్బుకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C (Section 80C of the Income Tax Act) కింద ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్న వ్యక్తికి పాలసీ మెచ్యూరిటీ సమయంలో పూర్తి బెనిఫిట్స్ చేతికొస్తాయి. ఒకవేళ, పాలసీ మెచ్యూరిటీ సమయం కంటే ముందే మరణిస్తే, నామినీకి డెత్ బెనిఫిట్స్ అందుతాయి. తద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.
రోజుకు కేవలం రూ.45తో రూ.25 లక్షల రిటర్న్ పొందడం ఎలా?
LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ప్రకారం, పాలసీహోల్డర్లు కనీసం రూ. 5 లక్షల హామీ మొత్తాన్ని పొందుతారు. 35 సంవత్సరాల్లో రూ. 25 లక్షలు చేతికి వస్తాయి. మీరు 35 సంవత్సరాల కాల పరిమితిని ఎంచుకుంటే, ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ. 16,300 లేదా నెలవారీ ప్రాతిపదికన రూ. 1,358 పెట్టుబడి పెట్టాలి. ఈ లెక్కన, రోజుకు కేవలం 45 రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ విధంగా 35 సంవత్సరాలకు మొత్తం 25 లక్షల రూపాయలకు మీరు ఓనర్‌గా మారతారు. సంవత్సరానికి రూ. 16,300 చొప్పున ఈ 35 సంవత్సరాల్లో మీరు చెల్లించే మొత్తం 5,70,500 రూపాయలు (16,300 x 35) అవుతుంది. ఈ పెట్టుబడికి 4 రెట్లకు పైగా మొత్తం మీకు దక్కుతుంది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Women Investment: ఆడవాళ్లు ఆర్థికంలో అదరగొడుతున్నారు: AMFI-Crisil నివేదిక
PF Withdrawal: ఇదీ శుభవార్తంటే - PF ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు!
Gold-Silver Prices Today 01 April: రూ.95,000 చేరిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
New Rules From April: UPI నుంచి IT వరకు, గ్యాస్ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
Gold-Silver Prices Today 31 Mar: రూ.93,000 దాటిన స్పాట్ గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్ ఏంటీ?
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Waqf Amendment Bill :కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది? విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
Pastor Praveen Kumar Death Case :పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై హోం మంత్రిని కలిసిన పాస్టర్లు - మాజీ ఎంపీకి పోలీసుల నోటీసులు