By: Arun Kumar Veera | Updated at : 12 Feb 2025 10:32 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 12 ఫిబ్రవరి 2025 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: సుంకాల యుద్ధం భయాలతో రికార్డ్ స్థాయికి చేరిన పసిడి, తన పరుగుకు కాస్త విరామం ఇచ్చింది, కొద్దిగా దిగి వచ్చింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,915 డాలర్ల దగ్గర ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 710 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 700 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 570 రూపాయల చొప్పున తగ్గాయి. అయినప్పటికీ, పన్నులతో కలుపుకుని 10 గ్రాముల (24K) రేటు ఇప్పటికీ రూ. 87,000 పైనే ఉంది. వెండి ధర మారనప్పటికీ, కిలోకు రూ.లక్ష పైనే పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,670 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,400 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 64,970 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,07,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,670 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 79,400 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 64,970 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,07,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 86,670 | ₹ 79,400 | ₹ 64,970 | ₹ 1,07,000 |
విజయవాడ | ₹ 86,670 | ₹ 79,400 | ₹ 64,970 | ₹ 1,07,000 |
విశాఖపట్నం | ₹ 86,670 | ₹ 79,400 | ₹ 64,970 | ₹ 1,07,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,940 | ₹ 8,667 |
ముంబయి | ₹ 7,940 | ₹ 8,667 |
పుణె | ₹ 7,940 | ₹ 8,667 |
దిల్లీ | ₹ 7,955 | ₹ 8,682 |
జైపుర్ | ₹ 7,955 | ₹ 8,682 |
లఖ్‌నవూ | ₹ 7,955 | ₹ 8,682 |
కోల్‌కతా | ₹ 7,940 | ₹ 8,667 |
నాగ్‌పుర్ | ₹ 7,940 | ₹ 8,667 |
బెంగళూరు | ₹ 7,940 | ₹ 8,667 |
మైసూరు | ₹ 7,940 | ₹ 8,667 |
కేరళ | ₹ 7,940 | ₹ 8,667 |
భువనేశ్వర్ | ₹ 7,940 | ₹ 8,667 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 7,696 | ₹ 8,276 |
షార్జా (UAE) | ₹ 7,696 | ₹ 8,276 |
అబు ధాబి (UAE) | ₹ 7,696 | ₹ 8,276 |
మస్కట్ (ఒమన్) | ₹ 7,790 | ₹ 8,309 |
కువైట్ | ₹ 7,430 | ₹ 8,187 |
మలేసియా | ₹ 7,062 | ₹ 7,354 |
సింగపూర్ | ₹ 6,961 | ₹ 7,724 |
అమెరికా | ₹ 6,781 | ₹ 7,216 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 430 తగ్గి రూ. 27,230 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: సిప్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, రిస్క్ పెంచొచ్చు - ఆలోచించి అడుగేయండి
Free Current: ఈ వేసవిలో AC వేసినా కరెంట్ బిల్లు రాదు, రోజంతా చల్లగా ఉండండి
Gold Hits All Time High: 10 గ్రాముల పసిడి కోసం లక్షలు ఖర్చు పెట్టాలా?, మూడు నెలల్లో మెగా ర్యాలీ
Education Loan: రూ.50 లక్షల విద్యారుణంపై టాప్-10 బ్యాంకుల్లో తాజా వడ్డీ రేట్లు ఇవీ
Home Loan EMI Calculator: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే ఎంత EMI చెల్లించాలి, EMIని ఎలా లెక్కిస్తారు?
Gold-Silver Prices Today 18 Mar: మళ్లీ భారీ జంప్, కొత్త రికార్డ్ కొట్టిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటీ?
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
WhatsApp Governance Mana Mitra: గేమ్ ఛేంజర్‌గా వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర ద్వారా త్వరలో 500 రకాల ప్రభుత్వ సేవలు: నారా లోకేష్
పదమూడేళ్లకే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి... 18 ఏళ్లకు 50 ఏళ్ల సీఎంతో రెండో పెళ్లి, విడాకులు... సినిమాలు వదిలేసిన హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?