By: ABP Desam | Updated at : 14 Sep 2021 08:22 AM (IST)
Edited By: Sai Anand Madasu
కైవైసీపై ఆర్బీఐ అలర్ట్
ఈ మధ్య కాలంలో బ్యాంకు వాళ్లమంటూ చాలా ఫోన్లు వస్తున్నాయి. మీ బ్యాంకు ఖాతా, డిమ్యాడ్ అకౌంట్ అప్ డేట్ చేయాలి. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, కార్డు పిన్ నంబర్ వంటి వివరాలు చెప్పండి. లేకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని.. ఇలా చాలా ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి. కొంత మంది వీరిని నమ్మి ఆ వివరాలు చెప్పడంతో, క్షణాల్లో వారి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఈ విషయంపై ఆర్‌బీఐకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఆర్‌బీఐ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను అలర్ట్ చేసింది. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లేదంటే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకోవాల్సి రావొచ్చని హెచ్చరించింది. మోసగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. కేవైసీ ( know your customer) మోసాలు పెరిగిపోతున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అకౌంట్ లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, కేవైసీ డాక్యుమెంట్ల కాపీలు, కార్డ్ ఇన్‌ఫర్మేషన్, పిన్, పాస్‌వర్డ్, ఓటీపీ వంటి వాటిని ఎవ్వరికీ షేర్ చేయొద్ద హెచ్చరించింది.
RBI cautions against frauds in the name of KYC updationhttps://t.co/rg6eEb56h5
— ReserveBankOfIndia (@RBI) September 13, 2021
అనధికార వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్స్ ద్వారా డేటాను షేర్ చేయొద్దని తెలిపింది. ఒకవేళ మోసగాళ్లు కేవైసీ అప్‌డేట్ కోసం కాల్ చేస్తే బ్యాంక్ అధికారులను సంప్రదించి.. కంప్లైంట్ ఇవ్వాలని తెలిపింది. మోసగాళ్లు నేరుగా కాల్ చేయొచ్చని లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా లింక్ పంపి కేవైసీ అప్‌డేషన్ ద్వారా మీ వివరాలను చోరీ చేసే అవకాశం ఉందని ఆర్బీఐ తెలిపింది.
కేవైసీ అప్‌డేషన్ పెండింగ్‌లో ఉన్న బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని కూడా ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ అప్‌డేషన్ కోసం ఖాతాదారులకు ఈ ఏడాది చివరి వరకు గడువు ఇవ్వాలని కోరింది. దీంతో డిసెంబర్ 31, 2021 వరకు ఆ అకౌంట్ల కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు విధించరు.
Also Read: EPFO Alert: 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్.. అలర్ట్.. అలా చేస్తే మీ డబ్బులు ఖతమ్
Also Read: Supreme Court: మ్యుటేషన్ ద్వారా ఆస్తిపై హక్కు వర్తించదు.. సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
Aadhaar Card Update: ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం - ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?
PAN Card: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు
Car Insurance: కారు బీమా - వారెంటీల విషయంలో ఓనర్‌లకు ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవీ
Gold Rate Ttoday: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి