By: ABP Desam, Arun Kumar Veera | Updated at : 15 Jan 2024 09:42 AM (IST)
టాక్స్ కట్టక్కర్లేని ఆదాయాలు ఇవి, చాలామందికి ఈ రూల్స్ తెలీదు
Income Tax Saving Tips 2024: మీరు సంపాదించే ఆదాయంలో పెద్ద మొత్తం డబ్బు ఇన్‌కమ్ టాక్స్ రూపంలో మీ చేయి దాటి వెళ్లిపోతుంటే.., దానికి అడ్డుకట్ట వేసే పన్ను మినహాయింపు (Income Tax Exemptions) మార్గాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
ఎంత ఆదాయం పన్ను రహితం? (Tax Rebate)
కొత్త పన్ను విధానం (New Income Tax Regime) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల ఆదాయం వరకు ఆదాయం పన్ను రహితం. పాత పన్ను విధానంలో (New Income Tax Regime) ఈ పరిమితి రూ. 5 లక్షలు. మరో రూ. 50 వేలు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) రూపంలో యాడ్ అవుతుంది.
కొత్త విధానంలో ఆదాయ పన్ను మినహాయింపులు, తగ్గింపులు (Income tax exemptions and deductions) ఏవీ ఉండవు. టాక్స్ రిబేట్ పరిమితి దాటితే, శ్లాబ్ సిస్టం ప్రకారం పన్ను చెల్లించాలి.
పాత పన్ను విధానం ప్రకారం, కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో పెట్టుబడి పెడితే, వివిధ సెక్షన్ల కింద ఆదాయ పన్ను మినహాయింపులు & తగ్గింపులు లభిస్తాయి. ఆ సెక్షన్ల ప్రకారం మదుపు చేసినా పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఇంకా మిగిలే ఉంటే, దానిని కూడా తగ్గించే మరికొన్ని విషయాలు ఉన్నాయి, చాలా కొద్దిమందికి మాత్రమే ఇవి తెలుసు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో (PPF) సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బు పూర్తిగా పన్ను రహితం (tax-free). ఈ పెట్టుబడి మీద వడ్డీ లభిస్తుంది, ఇది కూడా పూర్తిగా పన్ను రహితం.
సహజ పదవీ విరమణ కంటే ముందే స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary retirement) పొందే అవకాశం ఉద్యోగులకు ఉంది. దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. దీనిలో 5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని (Income Tax Act) సెక్షన్ 10(2) ప్రకారం, హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) లేదా వారసత్వంగా పొందిన డబ్బు పూర్తిగా పన్ను రహితం. ఆదాయపు పన్ను పత్రాలు (ITR) దాఖలు చేసే సమయంలో మీరు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.
మీరు వ్యవసాయ వ్యాపారం చేస్తుంటే, అంటే, వ్యవసాయం ద్వారా మీరు సంపాదించే ఆదాయానికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేల వరకు పన్ను మినహాయింపు ఉంది.
ఒక సంస్థలో భాగస్వామి ఉంటూ మీరు స్వీకరించే ఆదాయం మొత్తానికి పన్ను ఉండదు. కంపెనీ అప్పటికే దాని మీద పన్ను చెల్లించినందున, లాభాల మీద మాత్రమే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఉద్యోగి అయితే, మొదట 'పే రూల్స్'ను అర్థం చేసుకోండి. ఒక కంపెనీలో 5 సంవత్సరాల సర్వీసు తర్వాత గ్రాట్యుటీ వస్తుంది. ఈ గ్రాట్యుటీ డబ్బు పూర్తిగా పన్ను రహితం. ఈ పన్ను రహిత మొత్తానికి పరిమితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగి అందుకునే గ్రాట్యుటీలో రూ. 20 లక్షల మొత్తం వరకు పన్ను విధించరు, ఈ మొత్తం దాటితే ఆదాయ పన్ను చెల్లించాలి. అదే విధంగా, ప్రైవేట్ ఉద్యోగి సంపాదించిన గ్రాట్యుటీలో రూ. 10 లక్షల వరకు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు, ఆ మొత్తం దాటితేనే పన్ను కట్టాలి.
ఇవన్నీ చట్టబద్ధంగా పన్ను ఆదా చేయగల మార్గాలు. పన్ను ఎగవేత గురించి ఎప్పుడూ ఆలోచించకండి. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు చాలా ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయ పన్ను ఎగవేత చట్ట ప్రకారం నేరం.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే
Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!
ITR Filing: పన్ను చెల్లింపుదార్లకు గుడ్ న్యూస్ - ITR ఫైలింగ్ గడువు పెంచిన టాక్స్ డిపార్ట్‌మెంట్
Gold-Silver Prices Today 31 Dec: నగలు కొనేవాళ్లకు న్యూ ఇయర్ గిఫ్ట్, భారీగా తగ్గిన బంగారం రేటు - ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవి
New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
Cheapest Insurance Policy: ఇది దేశంలోనే అత్యంత చవకైన బీమా పాలసీ, కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా కవరేజ్
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం