search
×

ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా

ఒక సంస్థలో భాగస్వామి ఉంటూ మీరు స్వీకరించే ఆదాయం మొత్తానికి పన్ను ఉండదు.

FOLLOW US: 
Share:

ITR 2024 - Non taxable incomes: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 87A ప్రకారం వర్తించే 'టాక్స్‌ రిబేట్‌'కు మించి ఆదాయం సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు ఆదాయ పన్ను చెల్లించాలి. అయితే.. కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం ఇన్‌కమ్‌ టాక్స్‌ రూపంలో వెళ్లిపోతుంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఆ డబ్బు కూడా తన దగ్గరే ఉంటే మరో అవసరానికి వాడుకోవచ్చు కదా అనిపిస్తుంది. అయితే.. మీరు సంపాదించే అన్ని రకాల ఆదాయాలకు టాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు, కొన్ని మినహాయింపు (Income Tax Exemptions) మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. 

కొత్త పన్ను విధానం (New Income Tax Regime) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల ఆదాయం వరకు ఆదాయం పన్ను రహితం. పాత పన్ను విధానంలో (New Income Tax Regime) ఈ పరిమితి రూ. 5 లక్షలు. మరో రూ. 50 వేలు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) రూపంలో యాడ్‌ అవుతుంది. 

కొత్త విధానంలో ఆదాయ పన్ను మినహాయింపులు, తగ్గింపులు (Income tax exemptions and deductions) ఏవీ ఉండవు. టాక్స్‌ రిబేట్‌ పరిమితి దాటితే, శ్లాబ్‌ సిస్టం ప్రకారం పన్ను చెల్లించాలి. 

పాత పన్ను విధానం ప్రకారం, కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో పెట్టుబడి పెడితే వివిధ సెక్షన్ల కింద ఆదాయ పన్ను మినహాయింపులు & తగ్గింపులు లభిస్తాయి. పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఇంకా మిగిలే ఉంటే, దానిని కూడా తగ్గించే మరికొన్ని మార్గాలు ఉన్నాయి.

ఆదాయ పన్ను కట్టక్కర్లేని ఆదాయాలు: 

ఒక సంస్థలో భాగస్వామి ఉంటూ మీరు స్వీకరించే ఆదాయం మొత్తానికి పన్ను ఉండదు. కంపెనీ అప్పటికే దాని మీద పన్ను చెల్లించినందున, లాభాల మీద మాత్రమే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

మీరు ఉద్యోగి అయితే, మొదట 'పే రూల్స్‌'ను అర్థం చేసుకోండి. ఒక కంపెనీలో 5 సంవత్సరాల సర్వీసు తర్వాత గ్రాట్యుటీ వస్తుంది. ఈ గ్రాట్యుటీ డబ్బు పన్ను రహితం. అయితే, దీనికి కొంత పరిమితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగి అందుకునే గ్రాట్యుటీలో రూ. 20 లక్షల మొత్తం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం దాటితే ఆదాయ పన్ను చెల్లించాలి. అదే విధంగా, ప్రైవేట్ ఉద్యోగి సంపాదించిన గ్రాట్యుటీలో రూ. 10 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టక్కర్లేదు.

సహజ పదవీ విరమణ కంటే ముందే స్వచ్ఛంద పదవీ విరమణ ‍‌(Voluntary retirement) చేసే అవకాశం ఉద్యోగులకు ఉంది. దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. ఆదాయ పన్ను చట్ట ప్రకారం, ఈ డబ్బులో 5 లక్షల రూపాయల వరకు పన్ను చెల్లించనక్కరలేదు.

ఆదాయపు పన్ను చట్టంలోని (Income Tax Act) సెక్షన్ 10(2) ప్రకారం, హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) పొందిన డబ్బు లేదా వారసత్వంగా పొందిన డబ్బు పూర్తిగా పన్ను రహితం. ఆదాయపు పన్ను పత్రాలు (ITR) దాఖలు చేసే సమయంలో ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.

వ్యవసాయం ద్వారా మీరు సంపాదించే ఆదాయంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో, రూ. 5 వేల వరకు పన్ను చెల్లించనక్కర్లేదు. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి మీద లభించే వడ్డీకి (Interest Earned on PPF) కూడా ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.

మీ కష్టార్జితాన్ని ఆదాయ పన్ను రూపంలో చెల్లించడం మీకు ఇష్టం లేకపోతే, ఆదాయ పన్నును ఆదా చేసే మార్గాలు చాలా కనిపిస్తాయి. ఏ మార్గం ఎంచుకున్నా చట్టబద్ధంగా వెళ్లండి. ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ సమయంలో మీ ఆదాయాలను సమగ్రంగా చూపకపోతే, తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆదాయ పన్ను ఎగవేత చట్ట ప్రకారం నేరం, శిక్షార్హం అని గుర్తుంచుకోండి.

Published at : 25 Apr 2024 01:00 PM (IST) Tags: Income Tax ITR Filing Income Tax Saving Tax Tips ITR 2024

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Prices Today: ఒకేసారి భారీ పెద్ద షాక్‌ ఇచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: ఒకేసారి భారీ పెద్ద షాక్‌ ఇచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Tax Saving: తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!

Tax Saving: తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!

Gold-Silver Prices Today: ఒక్కో మెట్టు దిగుతూ జనానికి చేరువవుతున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: ఒక్కో మెట్టు దిగుతూ జనానికి చేరువవుతున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Mutual Funds: వేలకోట్లు విత్‌డ్రా చేసిన క్వాంట్ ఫండ్ కస్టమర్లు: మరి మీ పరిస్థితి? నిపుణుల సూచన ఇదే

Mutual Funds: వేలకోట్లు విత్‌డ్రా చేసిన క్వాంట్ ఫండ్ కస్టమర్లు: మరి మీ పరిస్థితి? నిపుణుల సూచన ఇదే

Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో కొత్త రూల్స్‌ - ఇన్సూరెన్స్‌ కంపెనీల ఆటలు చెల్లవు

Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో కొత్త రూల్స్‌ - ఇన్సూరెన్స్‌ కంపెనీల ఆటలు చెల్లవు

టాప్ స్టోరీస్

Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌

Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌

Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి

Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి

Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య

Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య