By: ABP Desam | Updated at : 03 Sep 2022 11:54 AM (IST)
Edited By: Arunmali
ఐదేళ్ల తర్వాత ఐటీసీ రేంజ్ మళ్లీ పెరిగింది (ఇమేజ్ సోర్స్ - ట్విట్టర్)
ITC’s marketcap: ఈ ఏడాది ప్రారంభం నుంచి చాప కింద నీరు సైలెంట్‌గా విస్తరిస్తున్న ఐటీసీ (ITC) మరో ఘనతను సాధించింది. ఐదేళ్ల విరామం తర్వాత, ఈ కంపెనీ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) ₹4,00,290 కోట్లకు చేరింది.
శుక్రవారం మార్కెట్‌లో ఐటీసీ షేరు ధర రూ.324.25 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే దాని 52 వారాల గరిష్టం కూడా. మార్కెట్ ముగిసేసరికి, 1.81 శాతం లేదా రూ.5.75 లాభంతో రూ.323.35 దగ్గర ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ₹4 లక్షల కోట్ల మార్కును అందుకుని, చివరకు ₹4,00,290 కోట్ల వద్ద సగర్వంగా నిలబడింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ₹3.96 లక్షల కోట్లు, అదానీ టోటల్ గ్యాస్ ₹3.95 లక్షల కోట్లు, కోటక్ మహీంద్ర బ్యాంక్ ₹3.80 లక్షల కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ ₹3.77 లక్షల కోట్లు, ఏషియన్ పెయింట్స్ ₹3.28 లక్షల కోట్లు, అవెన్యూ సూపర్‌మార్ట్స్ ₹2.96 లక్షల కోట్లు, బజాజ్ ఫిన్‌సర్వ్ ₹2.76 లక్షల కోట్లు, ఎల్&టీ ₹2.72 లక్షల కోట్లు, మారుతి సుజుకి లక్షల కోట్లు, హెచ్‌సీఎల్ టెక్ ₹2.50 లక్షల కోట్లతో ఐటీసీ దీని తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీనర్ధం, ఈ ఏడాది సైలెంట్ కిల్లర్‌లా మారి వీటన్నింటినీ కిందకు తొక్కేసిందీ కంపెనీ.
గత నెల రోజుల్లో ఐటీసీ స్టాక్ ప్రైస్ దాదాపు 5 శాతం, గత ఆరు నెలల్లో 47 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) దాదాపు 48 శాతం పెరిగింది. జూన్ ఫలితాల తర్వాత బాగా ర్యాలీ చేసింది.
జూన్ త్రైమాసికంలో (Q1FY23) ఐటీసీ మంచి నంబర్లను మార్కెట్ ముందు ఉంచింది. ప్రధాన వ్యాపారమైన సిగరెట్లు సహా, హోటళ్లు, అగ్రి విభాగాల్లో బలమైన ప్రదర్శన చేసి, Q1 నికర లాభంలో బలమైన స్పైక్ చూపించింది.
ఏడాది ప్రాతిపదికన... జూన్ త్రైమాసికంలో హోటల్స్ విభాగం మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. Q1FY22లోని ₹133 కోట్ల ఆదాయంతో పోలిస్తే, Q1FY23లో ₹580 కోట్లను ఆర్జించింది. ఇది 336% వృద్ది. ప్రధాన విభాగమైన ఎఫ్‌ఎంసీజీ (FMCG) ఆదాయం (సిగరెట్ వ్యాపారంతో కలిపి) ₹9,534 కోట్ల నుంచి ₹11,922 కోట్లకు పెరిగింది, ఇది 25% పెరుగుదల. వ్యవసాయ ఆదాయం ₹4,109 కోట్ల నుంచి ₹7,492 కోట్లకు చేరింది, ఇది 82% వృద్ధి. పేపర్ బోర్డ్స్, పేపర్స్, ప్యాకేజింగ్ ఆదాయం ₹1,582 కోట్ల నుంచి ₹2,267 కోట్లకు, 43% పెరిగింది. ఇతర ఆదాయాలు 8% పెరిగాయి.
ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, మహమ్మారి తర్వాత పెరిగిన డిమాండ్ దృష్ట్యా, ఐటీసీతోపాటు మొత్తం ఎఫ్‌ఎంసీజీ రంగం మీద ఎనలిస్టులు బుల్లిష్‌గా ఉన్నారు.
సమీప కాలంలో సిగరెట్ల మీద పన్ను పెంపు ఉండకపోవడం, అక్రమ సిగరెట్లను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వంటివి ఐటీసీ సిగరెట్ వ్యాపారంలో వాల్యూమ్ వృద్ధిని కొనసాగించడంలో సహాయపడతాయని బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ అంచనా వేసింది. నాన్-సిగరెట్ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో బలమైన వృద్ధి, హోటల్ వ్యాపారం మళ్లీ కళ, పేపర్‌బోర్డ్, పేపర్, ప్యాకేజింగ్ (PPP) వ్యాపారంలో స్థిరమైన వృద్ధి కలిసి.. రాబోయే రెండేళ్లలో రెండంకెల ఆదాయ, లాభ వృద్ధి సాధ్యపడుతుందని లెక్కగట్టింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
Allu Arjun Enquiry: లీగల్ టీమ్‌తో కలిసి విచారణకు అల్లు అర్జున్! అరెస్టుకు ఛాన్స్ ఉందా?