By: ABP Desam | Updated at : 28 May 2023 05:36 PM (IST)
ఐటీ నోటీసులు ( Image Source : Pixabay )
IT Scrutiny Notice:
ఆదాయపన్ను శాఖ మీకు నోటీసులు పంపిస్తోందా? ఎన్ని సార్లు పంపించినా మీరు స్పందించడం లేదా? అయితే మీ కొంప మునిగినట్టే! ఇలాంటి వారి కోసమే ఐటీ డిపార్ట్‌మెంట్ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరైతే నోటీసులకు బదులు పంపించరో.. వారి కేసుల్ని ఐటీ శాఖ ప్రత్యేకంగా స్క్రూటినీ చేయనుంది. అంతేకాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాలు, రెగ్యులేటరీ అథారిటీస్ అందించే పన్ను ఎగవేత కేసుల్నీ ప్రత్యేకంగా తీసుకోనుంది.
ఆదాయ సమాచారం సమర్పణలో ఎలాంటి అవకతవకలు కనిపించినా, సరైన సమాచారం ఇవ్వలేదని భావించినా ఆదాయపన్ను చట్టంలోని 143(2) సెక్షన్ ప్రకారం అధికారులు జూన్ 30 లోపు నోటీసులు జారీ చేస్తారు. అలాంటప్పుడు పన్ను చెల్లింపుదారులు సరైన ఆధారాలు, పత్రాలను వారికి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ 143(1) సెక్షన్ ప్రకారం ఆ నోటీసులకు స్పందనగా ఎలాంటి రిటర్న్ సమర్పించకపోతే ఆ కేసుల్ని నేషనల్ ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ సెంటర్ (NaFAC)కు బదిలీ చేస్తారు.
ఐటీ సెక్షన్ 142(1) ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌ను ఎక్కడ సమర్పించారు, ఎప్పుడు ఫైల్ చేశారు, రిటర్న్ చేశారా లేదా వంటి వివరాలను అడిగే హక్కు ఆదాయ పన్ను అధికారులకు ఉంటుంది. కాంపిటెంట్ అథారిటీ వద్ద విత్ర్‌డ్రా లేదా రద్దుతో సంబంధం లేకుండా వరుసగా పన్ను మినహాయింపులు పొందుతున్న వారి జాబితాను టాక్స్ డిపార్ట్‌మెంట్ రూపొందిస్తోంది.
ప్రి-ఫిల్డ్ డేటాతో ఆన్‌లైన్ ఫారాలు
2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఆన్‌లైన్ ITR-1 & ITR-4 సిద్ధమయ్యాయని ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ కూడా చేసింది. ఈ ఫారాల్లో కొంత సమాచారం ముందస్తుగానే నింపి (prefilled data) ఉంటుంది. ఈ సమాచారంలో, ఫారం-16 ప్రకారం జీతం ఆదాయం, పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయం ఉంటాయి. ఎక్సెల్ యుటిలిటీ ఫారంతో పోలిస్తే ఆన్‌లైన్ ఫారం భిన్నంగా ఉంటుంది. ఎక్సెల్ యుటిలిటీ ఫారం ద్వారా ITR ఫైల్ చేయడానికి ముందుగా ఆ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో అవసరమైన సమాచారాన్ని నింపి, తిరిగి ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
ఎక్సెల్ యుటిలిటీ ఫారంతో పోలిస్తే. ఆన్‌లైన్ ఫారం ద్వారా ITR ఫైల్ చేయడం చాలా సులభం. ఇందులో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-16తో పాటు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో (AIS) కనిపించే సమాచారంతో సరిపోల్చుకోవాలి. ఏవైనా తేడాలు కనిపిస్తే సరిచేసుకోవాలి. తద్వారా, ITR ఫైలింగ్ ద్వారా ఆదాయ పన్ను విభాగానికి పన్ను చెల్లింపుదారు అందించే ఆదాయ సమాచారం సరైనదే అని నిరూపించవచ్చు.
ఎవరు, ఏ ఫారాన్ని దాఖలు చేయాలి?
ఐటీఆర్-1ను వ్యక్తులు (Individuals), ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ సమర్పిస్తారు. ఐటీఆర్-4ను వ్యాపారులు, వృత్తి నిపుణులు దాఖలు చేస్తారు.
వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదార్లు, జీతం ఆదాయం, ఇంటి ఆస్తి, వడ్డీ ఆదాయం, రూ. 5 వేల వరకు వ్యవసాయ ఆదాయం వంటి వనరులు ఉన్నవాళ్లు ITR-1 దాఖలు చేయాలి. వ్యాపారం, వృత్తి ద్వారా రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు, HUFలు (హిందూ అవిభక్త కుటుంబాలు), సంస్థలు (LLPలు మినహా) ITR-4 దాఖలు చేయాలి. ఈ ఆదాయం 44AD, 44DA, 44AE సెక్షన్ల కింద వ్యాపారం లేదా ఏదైనా వృత్తి నుంచి వచ్చి ఉండాలి, వ్యవసాయ ఆదాయం రూ. 5000 మించకూడదు.
Gold-Silver Prices Today 10 Jan: గ్లోబల్‌గా పెరిగిన గోల్డ్ డిమాండ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
New FD Rates: ఈ 3 బ్యాంకుల్లో కొత్త సంవత్సరం నుంచి FD రేట్లు మార్పు - మీకు మరింత ఎక్కువ రాబడి
Train Ticket Rules: రైళ్లలో పిల్లలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు!, తొందరపడి టిక్కెట్ కొనకండి
Cyber Fraud: ఈ 14 సైబర్ మోసాలు గురించి తెలిస్తే మీ అకౌంట్‌లో డబ్బులు సేఫ్- ఎవడూ టచ్ చేయలేడు
PM Surya Ghar Yojana: సూర్య ఘర్ యోజన - సోలార్ ప్యానెళ్లు చలికాలంలో ఎలా పని చేస్తాయి, బిల్లు ఎంత వస్తుంది?
TTD Board Chairman : అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ
PM Modi Podcast : నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava: ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!