By: Arun Kumar Veera | Updated at : 10 Jan 2025 10:16 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 10 జనవరి 2025 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: యూఎస్ ఎకనమిక్ డేటా వచ్చిన తర్వాత, ఆ దేశంలో వడ్డీ రేట్ల కోత నిదానంగా సాగుతుందన్న అంచనాలతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ప్రకాశం పెరిగింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,696 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 270 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 250 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 210 రూపాయల చొప్పున పెరిగాయి. ఈ లెక్కన, ప్యూర్ గోల్డ్ (24K) 100 గ్రాములకు రూ. 2,700 పెరిగింది. కిలో వెండి ధర 1,000 రూపాయలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,470 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,850 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,610 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,01,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,470 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 72,850 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,610 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,01,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 79,470 | ₹ 72,850 | ₹ 59,610 | ₹ 1,01,000 |
విజయవాడ | ₹ 79,470 | ₹ 72,850 | ₹ 59,610 | ₹ 1,01,000 |
విశాఖపట్నం | ₹ 79,470 | ₹ 72,850 | ₹ 59,610 | ₹ 1,01,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,285 | ₹ 7,947 |
ముంబయి | ₹ 7,285 | ₹ 7,947 |
పుణె | ₹ 7,285 | ₹ 7,947 |
దిల్లీ | ₹ 7,300 | ₹ 7,962 |
జైపుర్ | ₹ 7,300 | ₹ 7,962 |
లఖ్‌నవూ | ₹ 7,300 | ₹ 7,962 |
కోల్‌కతా | ₹ 7,285 | ₹ 7,947 |
నాగ్‌పుర్ | ₹ 7,285 | ₹ 7,947 |
బెంగళూరు | ₹ 7,285 | ₹ 7,947 |
మైసూరు | ₹ 7,285 | ₹ 7,947 |
కేరళ | ₹ 7,285 | ₹ 7,947 |
భువనేశ్వర్ | ₹ 7,285 | ₹ 7,947 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 7,008 | ₹ 7,563 |
షార్జా (UAE) | ₹ 7,008 | ₹ 7,563 |
అబు ధాబి (UAE) | ₹ 7,008 | ₹ 7,563 |
మస్కట్ (ఒమన్) | ₹ 7,104 | ₹ 7,573 |
కువైట్ | ₹ 6,819 | ₹ 7,451 |
మలేసియా | ₹ 6,937 | ₹ 7,224 |
సింగపూర్ | ₹ 6,813 | ₹ 7,560 |
అమెరికా | ₹ 6,698 | ₹ 7,127 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 120 పెరిగి రూ. 26,420 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ 3 బ్యాంకుల్లో కొత్త సంవత్సరం నుంచి FD రేట్లు మార్పు - మీకు మరింత ఎక్కువ రాబడి
New FD Rates: ఈ 3 బ్యాంకుల్లో కొత్త సంవత్సరం నుంచి FD రేట్లు మార్పు - మీకు మరింత ఎక్కువ రాబడి
Train Ticket Rules: రైళ్లలో పిల్లలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు!, తొందరపడి టిక్కెట్ కొనకండి
Cyber Fraud: ఈ 14 సైబర్ మోసాలు గురించి తెలిస్తే మీ అకౌంట్‌లో డబ్బులు సేఫ్- ఎవడూ టచ్ చేయలేడు
PM Surya Ghar Yojana: సూర్య ఘర్ యోజన - సోలార్ ప్యానెళ్లు చలికాలంలో ఎలా పని చేస్తాయి, బిల్లు ఎంత వస్తుంది?
Standard Glass IPO: స్టాండర్డ్ గ్లాస్ ఐపీవో షేర్లు మీకు వచ్చాయా? - అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయండి
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
Game Changer OTT: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy