search
×

Credit cards: క్రెడిట్ కార్డులు ఒకటి కంటే ఎక్కువున్నాయా? ఉంటే లాభం ఏంటి?

వామ్మో.. కొన్ని రోజుల్లో క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. లేకపోతే అంతే సంగతులు.. బిల్లు తడిసిమోపెడవుతుంది అని ఆలోచిస్తున్నారా? ఒక కార్డే మెయింన్ టెన్ చేయలేక చస్తున్నాం అనుకుంటున్నారా?

FOLLOW US: 
Share:

క్రెడిట్ కార్డు ఉంటే.. ఎక్కువ ఖర్చు చేస్తాం. అస్సలు అదుపు ఉండదు.. డబ్బులు ఖర్చు చేసేదాకా మనసు ఒప్పుకోదు అని ఆలోచిస్తున్నారా? కానీ క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉన్నా లాభమే. మీరు చేయాల్సిందల్లా ఖర్చులు, తిరిగి చెల్లించడం పట్ల క్రమశిక్షణగా ఉంటే చాలు.  ఈ కింద ఇచ్చిన కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది.

  • మీ క్రెడిట్ కార్డు వడ్డీ లేకుండా స‌మ‌యానికి చెల్లించే విధంగా చూసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన  తేదీ నుంచి చెల్లింపు గ‌డువులోపు పూర్తిచేయాలి.   ఎటీఎమ్ మనీ విత్ డ్రాను మినహాయించి క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ ఉండ‌దు. బిల్లు మొత్తాన్ని సరైన తేదీలో తిరిగి చెల్లిస్తే ఎలాంటి ఆద‌న‌పు భారం ఉండ‌దు.
  • క్రెడిట్ కార్డుల‌పై ఇచ్చే రివార్డు పాయింట్ల‌ను వాడుకోవాలి. క్రెడిట్ కార్డు లావాదేవిలపై సంస్థ‌లు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు వంటి ప్ర‌యోజ‌నాల‌ు క‌ల్పిస్తాయి. షాపింగ్, పెట్రోల్‌, ప్రయాణం వంటి వాటి కోసం వేర్వేరు కార్డుల‌తో చెల్లిస్తే ఆ కార్డుల‌పై వేర్వేరు రివార్డుల‌ు రావొచ్చు.
  •  పలు రకాల క్రెడిట్ కార్డులలో ఈఎంఐ ఎంపిక ఆఫర్లను పోల్చుకోవాలి. క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు కొన్ని వ‌స్తువులు, సేవలపై నో కాస్ట్ ఈఎంఐలను అందిస్తారు. వ్యాపారులు వ‌డ్డీ ర‌హిత‌ ఈఎంఐల‌ ఖర్చులను భరిస్తారు. కార్డుదారులు ఈఎంఐలలో కొనుగోలు ఖర్చును తిరిగి చెల్లించాలి. ఈఎంఐ వడ్డీ వ్యయంపై వేసే జీఎస్‌టీని కార్డుదారుడు భరించాలి. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు నో-కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్న తరువాత కార్డుదారులకు అదనపు డిస్కౌంట్‌ను అందిస్తారు.
  • గడువుకు ముందే సేకరించిన రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయాలి. గ‌డువు తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుంటే వోచ‌ర్ల‌ను కొనేందుకు లేదా ఏదైనా వ‌స్తువుల కొనుగోలు స‌మ‌యంలో ఉప‌యోగించాలి.
  • మీరు రిమైండర్‌లను సెట్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ గడువు తేదీలను ట్రాక్ చేయాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు తిరిగి చెల్లించే సదుపాయాలను అందించే వివిధ యాప్‌లు, వాలెట్‌లు కూడా వారి వినియోగదారులకు బిల్ తిరిగి చెల్లించే రిమైండర్‌లను పెట్టుకునే స‌దుపాయం క‌ల్పిస్తాయి.

క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోళ్లు నిర్వహిస్తే రివార్డు పాయింట్లు వస్తాయి. క్రెడిట్ కార్డు ప్రాతిపదికన రివార్డు పాయింట్లు మారుతాయి. కొన్ని కార్డు కొన్ని అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంటారు. కొన్ని కార్డుల ద్వారా ఫ్యూయెల్ కొట్టిస్తే ఎక్కువ పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని కార్డుల వల్ల ట్రావెల్ టికెట్లు బుక్ చేస్తే ఎక్కువ పాయింట్ల వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సినిమా టికెట్లు, షాపింగ్‌కు చేస్తే ఎక్కువ పాయింట్లు అందించే కార్డులూ ఉన్నాయి. అందువల్ల మీ అవసరాలను ఆలోచించుకుని కార్డలను తీసుకోండి.

Published at : 16 Jul 2021 06:31 PM (IST) Tags: credit cards credit card score credit score benefits

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 19 Nov: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్‌ రష్‌, సిల్వర్‌ షైనింగ్‌' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 19 Nov: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్‌ రష్‌, సిల్వర్‌ షైనింగ్‌' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Stock Market Trading: ట్రేడింగ్‌లో రూ.50 లక్షల కోట్ల నష్టం - ఈ 5 తప్పులతో 'శని'ని రెడ్‌ కార్పెట్‌ వేసి పిలిచినట్లే!

Stock Market Trading: ట్రేడింగ్‌లో రూ.50 లక్షల కోట్ల నష్టం - ఈ 5 తప్పులతో 'శని'ని రెడ్‌ కార్పెట్‌ వేసి పిలిచినట్లే!

Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్‌ - ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వార్నింగ్‌

Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్‌ - ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వార్నింగ్‌

High Interest: ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ

High Interest: ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ

EMI Fact: ఈఎంఐ చెల్లింపుల్లో అందరిలాగే మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? - తప్పదు భారీ నష్టం!

EMI Fact: ఈఎంఐ చెల్లింపుల్లో అందరిలాగే మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? - తప్పదు భారీ నష్టం!

టాప్ స్టోరీస్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?

WhatsApp Fine: వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!

WhatsApp Fine: వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?

Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి

Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి