By: Arun Kumar Veera | Updated at : 08 Apr 2024 04:46 PM (IST)
టాక్స్ పడే & టాక్స్ పడని పోస్టాఫీస్ పథకాలు
Income Tax On Post Office Schemes: పోస్టాఫీసులు అందిస్తున్న పొదుపు, పెట్టుబడి పథకాలన్నీ భారత ప్రభుత్వం అమలు చేస్తున్నవే. కాబట్టి, ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పెట్టుబడులకు రక్షణ ఉంటుంది. వీటిలో కొన్ని పోస్టాఫీస్ పథకాలు ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి రావు, పూర్తి మినహాయింపు లభిస్తుంది. కొన్ని పథకాలపై వచ్చే ఆదాయానికి TDS (Tax Deducted at Source) చెల్లించాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ పథకంలో జరిగే లావాదేవీ మొత్తం నిర్ణీత పరిధిని మించితే TDS వర్తిస్తుంది. పరిమితి లోపు ఉంటే TDS కట్ కాదు.
TDS అంటే?
'ఆదాయ మూలం వద్ద పన్ను తగ్గింపు'ను TDS అంటారు. ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయంపై ముందుగానే ఆదాయ పన్ను వసూలు చేసే విధానం ఇది. తద్వారా, పన్ను ఎగవేతను అడ్డుకోవచ్చు. ఇలా ముందుగానే కట్ అయిన TDSను ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ITR) ఫైలింగ్ చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ITR ఫైలింగ్ సమయంలో టాక్స్ కట్టాల్సి వస్తే, TDS పోను మిగిలిన డబ్బు కడితే సరిపోతుంది. ఒకవేళ పన్ను పరిధిలోకి రాకపోతే, TDS మొత్తం తిరిగి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
టాక్స్ పడే & టాక్స్ పడని పోస్టాఫీస్ పథకాలు:
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit)
పోస్టాఫీసు RD స్కీమ్ కింద, TDS కట్ అయ్యే పరిమితి సాధారణ పౌరులకు (60 ఏళ్ల వయస్సు లోపు వాళ్లు) రూ. 40,000. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్ల వయస్సున్న లేదా దాటిన వాళ్లు) పరిమితి రూ. 50,000.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (Post Office Time Deposit)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద (Section 80C of Income Tax Act 1961), ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాల వ్యవధి కలిగిన టైమ్ డిపాజిట్లకు పన్ను వర్తిస్తుంది. ఈ కాల గడువు పథకాలపై సంపాదించే వడ్డీకి ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (Post Office Monthly Income Scheme)
ఈ పథకం కింద వచ్చే వడ్డీ రూ. 40,000 దాటితే ఆదాయ పన్ను వర్తిస్తుంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు రాదు.
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనపై వచ్చే ఆదాయానికి TDS ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌కు (SCSS) సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు దక్కుతుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పబ్లిక్ ప్రావిండెట్ ఫండ్ (PPF)
NSC పథకం కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టే పెట్టుబడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ అకౌంట్‌పై వచ్చే వడ్డీపై కూడా TDS వర్తించదు. PPF పథకం కూడా పన్ను మినహాయింపు కిందకు వస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP)
ఈ పథకం ఆదాయ పన్ను మినహాయింపు కిందకు రాదు. అయితే, ఈ స్కీమ్ మెచ్యూరిటీ సమయంలో చేతికి వచ్చే మొత్తంపై TDS కట్ కాదు.
మరో ఆసక్తికర కథనం: గుడ్‌న్యూస్, స్పెషల్ స్కీమ్ అమృత్ కలశ్ గడువు పెంచిన స్టేట్ బ్యాంక్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఇవి, కానీ జాగ్రత్త!
Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?
Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు