By: Arun Kumar Veera | Updated at : 03 Apr 2024 08:48 AM (IST)
కేవలం రెండేళ్లలో భారీ ఆదాయం, ఎస్‌బీఐ ప్రత్యేక పథకం
SBI Sarvottam FD Scheme Details In Telugu: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వివిధ టెన్యూర్స్ కోసం చాలా రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను (SBI Fixed Deposits) అమలు చేస్తోంది. వాటిలో కొన్ని పథకాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. ఆ డిపాజిట్ల కాల గడువు, వడ్డీ రేట్లు ఇతర పథకాల కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రత్యేక పథకాల్లో ఒకటి సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.
ఎస్‌బీఐ సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం వివరాలు:
నాన్-కాలబుల్ డిపాజిట్ స్కీమ్
సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం నాన్-కాలబుల్ డిపాజిట్ స్కీమ్. మెచ్యూరిటీ గడువు ముగియడానికి ముందే ఈ అకౌంట్‌ను బ్రేక్ చేయడం, లేదా క్లోజ్ చేయడానికి అనుమతి ఉండదు.
ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు?
ఎస్‌బీఐ సర్వోత్తమ్ స్కీమ్‌లో కనిష్టంగా రూ. 1 కోటి రూపాయలు (SBI Sarvottam FD Minimum Deposit) పెట్టుబడి పెట్టాలి. గతంలో ఈ కనీస పరిమితి రూ. 15 లక్షలుగా ఉంది. ఈ స్కీమ్‌లో గరిష్ట డిపాజిట్ పరిమితి (SBI Sarvottam FD Maximum Deposit) లేదు.
ఎంత వడ్డీ వస్తుంది? (SBI Sarvotham Scheme Interest Rate)
7.10 శాతం నుంచి 7.90 శాతం వరకు వడ్డీ రేటును స్టేట్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
స్టేట్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఎస్‌బీఐ సర్వోత్తమ్ టర్మ్ ప్లాన్‌లో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాల గడువుతో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. ఇందులోనూ రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల డిపాజిట్ మొత్తానికి ఒక ప్లాన్; రూ.2 కోట్లు దాటిన మొత్తానికి మరొక ప్లాన్ ఉంటుంది.
రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల డిపాజిట్లపై వడ్డీ రేటు
ఏడాది కాల పరిమితితో డిపాజిట్ చేసే సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వాళ్లకు) బ్యాంక్ 7.10 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. రెండేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇదే కాలానికి సీనియర్ సిటిజన్స్‌కు (60 ఏళ్లు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) మరో 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే.. ఏడాది కాల వ్యవధి సర్వోత్తమ్ స్కీమ్ డిపాజిట్‌లో సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్ల డిపాజిట్లపై 7.90% వడ్డీ రేటును పొందుతారు. ఇది 8.14% వార్షిక రాబడికి మారుతుంది.
రూ.2 కోట్లు దాటిన డిపాజిట్లపై వడ్డీ రేటు
రూ.2 కోట్లు దాటిన డిపాజిట్లపై, ఒక సంవత్సరం కాల వ్యవధికి, సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు 7.05 శాతం. ఇదే డిపాజిట్‌పై రెండేళ్లకు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటు 6.90 శాతం. సీనియర్ సిటిజన్లు ఒక సంవత్సరం కోసం డిపాజిట్ చేస్తే 7.55 శాతం వడ్డీ ఆదాయం వస్తుంది. రెండేళ్ల కోసం డిపాజిట్ చేస్తే 7.40 శాతం వడ్డీ పొందొచ్చు, ఇది 7.61% వార్షిక రాబడికి మారుతుంది.
2023 ఫిబ్రవరి 17 నుంచి ఇవే వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.
ఎవరు అర్హులు? (Eligibility For SBI Sarvotham Scheme)
SBI సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇండివిడ్యువల్స్, నాన్-ఇండివిడ్యువల్స్ పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్లు, NRIలు అనర్హులు.
ఎస్‌బీఐ సర్వోత్తమ్ స్కీమ్‌లో కాల గడువు ముగిసిన తర్వాత ఆ డిపాజిట్లను రెన్యువల్ చేయించుకోవడానికి వీలుండదు. ఆ డిపాజిట్ మెచ్యూరిటీ పిరియడ్ పూర్తి కాగానే వడ్డీతో కలిపి ఆ మొత్తం పెట్టుబడిదారు ఖాతాలో జమవుతుంది. మీకు ఆ స్కీమ్ మళ్లీ కావాలంటే, ఫ్రెష్‌గా మళ్లీ డిపాజిట్ చేయాలి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు