By: ABP Desam | Updated at : 29 Sep 2023 11:01 AM (IST)
సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్ బ్యాంకుల ఇవే!
FD Interest Rates: దేశంలోని ఐదు లీడింగ్ బ్యాంకులు సెప్టెంబర్ నెలలో తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను మార్చాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. మీ డబ్బుకు స్థిరమైన వడ్డీ రేటుతో పాటు టాక్స్ బెనిఫిట్స్ అందిస్తాయి.
సెప్టెంబర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంకులు... IDBI బ్యాంక్, DCB బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, యెస్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం అక్టోబర్ 4-6 తేదీల్లో జరుగుతుంది. ఆ సమావేశం ఫలితం ఆధారంగా వడ్డీ రేట్లను మార్చాలని చాలా బ్యాంకులు ఎదురు చూస్తున్నాయి.
1. IDBI బ్యాంక్: సాధారణ ప్రజలకు ఈ బ్యాంక్ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (IDBI Bank fixed deposit interest rates), 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలానికి 3% నుంచి 6.80% మధ్య మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు 3.50% నుంచి 7.30% ఉన్నాయి. IDBI బ్యాంక్ సెప్టెంబర్ 15 నుంచి తన FD వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ పౌరులు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మెచ్యూరిటీలపై గరిష్టంగా 6.8% వడ్డీ రేటును పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు అదే కాలవ్యవధికి 7.3% వడ్డీని అందుకోవచ్చు.
2. DCB బ్యాంక్: RBI MPC సమావేశానికి ముందు FD వడ్డీ రేట్లను సవరించి తన కస్టమర్లను ఆశ్చర్యపరిచింది DCB బ్యాంక్. రెసిడెంట్, NRE, NRO సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీ రేట్లను (DCB Bank fixed deposit interest rates) ఈ బ్యాంక్ రివైజ్ చేసింది. ఖాతాలో రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల లోపు ఉన్న నిల్వలపై ఇప్పుడు గరిష్టంగా 8.00% వడ్డీని కస్టమర్ తీసుకోవచ్చు. రివిజన్ తర్వాత DCB బ్యాంక్ FD వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. రెగ్యులర్ కస్టమర్లు ఇప్పుడు 25 నెలల నుంచి 26 నెలల మెచ్యూరిటీ కలిగిన FDలపై గరిష్టంగా 7.90% వడ్డీ రేటు పొందొచ్చు, సీనియర్ సిటిజన్‌లు, 2 కోట్ల కంటే తక్కువ ఉండే సింగిల్ డిపాజిట్ మీద 8.50% వడ్డీ ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు. అన్ని మెచ్యూరిటీ పిరియడ్స్ కోసం సాధారణ ప్రజలకు ఈ బ్యాంక్ అందించే ప్రామాణిక రేటు కంటే, సీనియర్ సిటిజన్లు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని డ్రా చేయవచ్చు.
3. యాక్సిస్ బ్యాంక్: ఎంపిక చేసిన కాల వ్యవధుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లకు యాక్సిస్ బ్యాంక్ కోత పెట్టింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను (Axis Bank fixed deposit interest rates) సుమారు 50 బేసిస్ పాయింట్ల (అర శాతం) మేర తగ్గించింది. యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు సెప్టెంబర్ 15, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3% నుంచి 7.10% మధ్య వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంక్ అందిస్తుంది.
4. కోటక్ మహీంద్ర బ్యాంక్: ఈ బ్యాంక్ కూడా, రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (Kotak Mahindra Bank fixed deposit interest rates) అప్‌డేట్ చేసింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంక్, రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.75% నుంచి 7.25% మధ్య వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.25% నుంచి 7.75% మధ్య వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. 23 నెలల కాల వ్యవధితో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) మేర పెంచాలని సెప్టెంబర్ 13న బ్యాంక్ నిర్ణయించింది. ఈ రేటు ప్రకారం, ఈ మెచ్యూరిటీ గడువులో, సాధారణ ప్రజలు గరిష్టంగా 7.25% వడ్డీ రేటును పొందొచ్చు. అదే టైమ్ పిరియడ్‌కు సీనియర్ సిటిజన్లు 7.75% వడ్డీని డ్రా చేయొచ్చు.
5. యెస్ బ్యాంక్: కస్టమర్లను ఆకర్షించడానికి FD వడ్డీ రేట్లను సవరించింది యెస్ బ్యాంక్. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ల విషయంలో, కొన్ని కాల వ్యవధులపై FD వడ్డీ రేట్లను (Yes Bank fixed deposit interest rates) సవరించింది. సెప్టెంబర్ 4, 2023న FD వడ్డీ రేట్లను ఈ బ్యాంక్ సవరించింది. రివిజన్ తర్వాత కొత్త రేట్ల ప్రకారం, సాధారణ కస్టమర్లకు 3.25% నుంచి 7.75% మధ్య వడ్డీ రేట్లను యెస్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే... 18 నుంచి 24 నెలల కాల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 3.75% నుంచి 8.25% మధ్య వడ్డీ ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్