By: ABP Desam | Updated at : 21 Dec 2023 01:43 PM (IST)
పొదుపు ఖాతాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు
Higher interest rate on savings account: మన దేశంలో వివిధ రకాల బ్యాంకుల్లో ప్రధానంగా 5 రకాల బ్యాంక్ అకౌంట్లు కనిపిస్తాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ (Savings Bank Account), కరెంట్ బ్యాంక్ అకౌంట్ (Current Bank Account), ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ (Fixed Deposit Account), రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (Recurring Deposit Account.), శాలరీ అకౌంట్ (Salary Account).
ఒక సర్వే ప్రకారం, 2023 జనవరి నాటికి, మన దేశంలో 225.5 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ వాటా పొదుపు ఖాతాలది. ఈ అకౌంట్లకు కనీస నగదు నిల్వ పరిమితి (Minimum cash balance) తక్కువగా ఉంటుంది. పొదుపు ఖాతాల్లో ఎప్పుడైనా డబ్బు జమ చేయవచ్చు, తిరిగి తీసుకోవచ్చు. అందువల్లే, సేవింగ్స్ అకౌంట్ల మీద బ్యాంక్‌లు చెల్లించే వడ్డీ రేటు (Interest rate on savings accounts) చాలా తక్కువగా ఉంటుంది.
కస్టమర్లను ఆకర్షించడానికి కొన్ని బ్యాంక్‌లు, ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు తమ సేవింగ్స్ అకౌంట్ల మీద కూడా ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సమానమైన వడ్డీ రేటును (Interest rate on fixed deposits) చెల్లిస్తున్నాయి. దీంతోపాటు, వడ్డీ రేట్ల విషయంలోనూ ఎక్కువ ఆప్షన్లు ఇస్తున్నాయి. ఇంట్రస్ట్ ఇన్‌కమ్ ఇంట్రస్ట్‌గా ఉండడంతో, ప్రజలు రిస్కీ అసెట్స్ వైపు వెళ్లకుండా సేవింగ్స్ అకౌంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, ఈ బ్యాంకుల్లోకి డిపాజిట్స్ పెరుగుతున్నాయి.
సేవింగ్స్ అకౌంట్ మీద ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌లు (Indian banks offering higher interest on savings account):
DCB బ్యాంక్
రూ.10 లక్షల నుంచి రూ.2 కోట్ల లోపు బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 8% వడ్డీ రేటు
రూ.10 కోట్ల నుంచి రూ.200 కోట్ల లోపు బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 7.75% వడ్డీ రేటు
ఈ రేట్లు 2023 సెప్టెంబర్ 27 నుంచి అమలు
IDFC ఫస్ట్ బ్యాంక్
రూ.5 లక్షల నుంచి రూ.25 కోట్ల లోపు బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 7% వరకు వడ్డీ
ఖాతాలో బ్యాలెన్స్‌ను బట్టి 3% - 7% రేంజ్‌లో వడ్డీ రేట్లు
ఈ రేట్లు 2023 అక్టోబర్ 1 నుంచి అమలు
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
రూ.10 లక్షల నుంచి రూ.5 కోట్ల లోపు ఉన్న సేవింగ్స్ అకౌంట్స్ మీద గరిష్టంగా 7.50% వడ్డీ రేటు
ఖాతాలో బ్యాలెన్స్‌ను బట్టి 3% - 7.5% రేంజ్‌లో వడ్డీ రేట్లు
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
రూ.5 లక్షలు దాటిన నిల్వలపై 7.50% వడ్డీ రేటును
ఖాతాలో బ్యాలెన్స్‌ను బట్టి 3% - 7.5% రేంజ్‌లో వడ్డీ రేట్లు
ఈ రేట్లు 2023 నవంబర్ 20 నుంచి అమలు
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్‌లపై 7.25% వడ్డీ రేటు
ఖాతాలో బ్యాలెన్స్‌ను బట్టి 3.5% - 7.25% రేంజ్‌లో వడ్డీ రేట్లు
ఈ రేట్లు 2023 సెప్టెంబర్ 11 నుంచి అమలు
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల లోపు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై 7.50% వడ్డీ రేటు
ఖాతాలో బ్యాలెన్స్‌ను బట్టి 3.51% - 7.50% రేంజ్‌లో వడ్డీ రేట్లు
ఈ రేట్లు 2023 డిసెంబర్ 1 నుంచి అమలు
మరో ఆసక్తికర కథనం: పెద్దగా మారని పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర