By: ABP Desam | Updated at : 23 Jun 2023 03:12 PM (IST)
ITR-1 ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్ కాదు?
Income Tax Return For FY 2022-23: ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్, ITR-1 నుంచి ITR-4 వరకు ఉన్న ఫామ్స్‌ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్ల కోసం నిర్దేశించింది. టాక్స్ పేయర్ సంపాదన, ఆదాయ మూలాల ఆధారంగా ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫారాన్ని (ITR Form) ఎంచుకోవాలి. సరైన ఫామ్‌ను ఎంచుకోకపోతే, ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. తప్పుడు ఫారాన్ని పన్ను విభాగం తిరస్కరిస్తుంది. 15 రోజుల లోపు మళ్లీ సరైన ఫారాన్ని పూర్తి చేసి, సమర్పించాలి. మరోవైపు, పదేపదే తప్పులు చేస్తే IT నోటీసును, పెనాల్టీని భరించాల్సి వస్తుంది.
ITR-1 కింద రిటర్న్ ఫైల్ చేయడానికి జీతం తీసుకునేవారిని & ఇండివిడ్యువల్ పర్సన్స్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్ అనుమతిస్తుంది. మిగిలిన ఫామ్స్ కంటే ఇది సరళంగా ఉంటుంది. మిగిలిన ఫారాలతో పోలిస్తే దీనిలో ఎక్కువ సమాచారం ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే, జీతం తీసుకునే టాక్స్ పేయర్లందరికీ ITR-1 ఫామ్ వర్తించదు. వాళ్ల ఇన్‌కం సోర్స్ ఆధారంగా వేరే ఫారం కూడా ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి జరిపిన లావాదేవీల ఆధారంగా అతను ITR-1కి అర్హుడా/అనర్హుడా అన్నది డిసైడ్ అవుతుంది.
ITR-1 ఎవరు ఫైల్ చేయాలి?
భారతదేశ పౌరులు ITR-1 ఫారమ్ ఫైల్ చేయవచ్చు
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉండాలి
జీతం, పెన్షన్, కుటుంబ పెన్షన్, ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం ITR-1 కిందకు వస్తుంది.
వ్యవసాయ ఆదాయం ద్వారా రూ. 5000కు మించకూడదు.
పోస్టాఫీస్/కోఆపరేటివ్ సొసైటీ/బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ నుంచి వడ్డీ ఆదాయం
సేవింగ్స్ ఖాతాల నుంచి వడ్డీ ఆదాయం,
డివిడెండ్స్
ఆదాయపు పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ, ఇతర రూపాల్లో వడ్డీ ఆదాయం తీసుకున్న వ్యక్తులు ITR-1 ఫామ్ పూరించవచ్చు.
ITR-1 ఎవరు ఫైల్ చేయలేరు?
ప్రవాస భారతీయులు
మొత్తం ఆదాయం ₹ 50 లక్షలకు మించినప్పుడు
వ్యవసాయ ఆదాయం ₹ 5000/- కంటే ఎక్కువ ఉన్నప్పుడు
లాటరీ, గుర్రపు పందేలు, చట్టబద్ధమైన జూదం నుంచి ఆదాయం వచ్చినప్పుడు
బంగారం, ఈక్విటీ షేర్లు వంటివాటిపై మూలధన లాభాలు (స్వల్పకాలిక & దీర్ఘకాలిక లాభాలు) వచ్చినప్పుడు
స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయని ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టినప్పుడు
వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం ఉన్నప్పుడు
ఒక కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటే
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N కింద TDS ఉంటే
ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల నుంచి ఆదాయం ఉంటే
ITR-1 ఫైల్ చేయడానికి అర్హతలు లేనివాళ్లు
హిందూ అవిభక్త కుటుంబాలు (HUF) కూడా ITR-1 ఫైల్ చేయలేవు
పొరపాటున ITR-1 ఫైల్ చేస్తే ఏమవుతుంది?
ఎవరైనా పొరపాటున ఐటీఆర్-1 ఫైల్ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ దానిని స్వీకరించదు, నోటీసు కూడా రావచ్చు. అప్పుడు, రివైజ్డ్ ITRను ఫైల్ చేయాల్సి వస్తుంది. నోటీసు తేదీ నుంచి 15 రోజులలోపు దాఖలు చేయాలి. ఆ గడువు కూడా దాటితే, మీరు నింపిన ITR చెల్లదు.
ఆదాయ పన్ను రిటర్న్ ఫారం సమర్పించడానికి చివరి తేదీ 31 జులై 2023. ఆ తర్వాత, పెనాల్టీ కట్టి ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఐటీ డిపార్ట్‌మెంట్ అనుమతి ఇస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఐటీ స్టాక్స్‌కు రెడ్ సిగ్నల్, Q1 రిజల్ట్స్ ముళ్లలా గుచ్చుకోవచ్చు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు