search
×

ITR: ఇన్‌కమ్‌ టాక్స్‌ ఫామ్‌లో 6 మార్పులు - ఫైల్‌ చేసే ముందే పూర్తిగా తెలుసుకోండి

FY 2021-22తో పోలిస్తే, FY 2022-23 రిటర్న్‌ ఫైలింగ్‌లో ఆదాయ పన్ను విభాగం కొన్ని మార్పులు చేసింది.

FOLLOW US: 
Share:

ITR Form Changes in FY 2022-23: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఈ నెలాఖరు (31 జులై 2023‌) వరకు గడువుంది. ఈ డేట్‌ దాటిన తర్వాత రిటర్న్‌ ఫైల్‌ చేయాలంటే ఫైన్‌ కట్టాలి. 

FY 2021-22తో పోలిస్తే, FY 2022-23 రిటర్న్‌ ఫైలింగ్‌లో ఆదాయ పన్ను విభాగం కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులు పెద్దవి కావు. కానీ మీరు ITR ఫైల్ చేయబోతున్నట్లయితే, వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. 

వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) ఆదాయాలు
వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై వచ్చే ఆదాయంపై కట్టాల్సిన టాక్స్‌కు సంబంధించి, 2022 ఏప్రిల్‌లో మార్పులు జరిగాయి. క్రిప్టో కరెన్సీ లావాదేవీపై సెక్షన్ 194S కింద TDS వర్తిస్తుంది. VDA నుంచి వచ్చే ఆదాయాన్ని డిక్లేర్‌ చేసేలా ITR ఫామ్‌లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు, టాక్స్‌ పేయర్లు VDA నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలి. 

2022-23లో ఒక వ్యక్తి క్రిప్టో అసెట్స్‌ ద్వారా ఆదాయం ఆర్జిస్తే, ఆ అసెట్స్‌ కొనుగోలు తేదీ, ట్రాన్స్‌ఫర్‌ డేట్‌, కొనుగోలు వ్యయం, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలను నమోదు చేయాలి. దీంతో పాటు, ఫామ్‌ 26AS, AISను టాక్స్‌ పేయర్‌ సరిపోల్చుకోవడం అవసరం.

80G డిడక్షన్‌ క్లెయిమ్ చేయడానికి ARN వివరాలు
2022-23 ఆర్థిక సంవత్సరంలో విరాళం ఇస్తే, సెక్షన్ 80G కింద మినహాయింపు లభిస్తుంది. ఇందుకోసం విరాళానికి సంబంధించిన ARN నంబర్‌ను ITR ఫారమ్‌లో ఇవ్వాలి. విరాళాలపై 50 శాతం క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

టాక్స్‌ కలెక్షన్‌ ఎట్‌ సోర్స్‌ (TCS) 
కొన్ని సందర్భాల్లో పన్ను చెల్లింపుదారు నుంచి ముందస్తుగానే TCS వసూలు చేస్తారు. టాక్స్‌ ఫైలింగ్‌ టైమ్‌లో దీనిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అలాగే, గత సంవత్సరాల్లో సెక్షన్ 89A కింద రిలీఫ్ క్లెయిమ్ చేసి, ఆ తర్వాత నాన్ రెసిడెంట్‌గా మారితే, అటువంటి ఎగ్జమ్షన్స్‌పై పన్ను విధించదగిన ఆదాయ వివరాలను ITR ఫామ్‌లో చెప్పడం అవసరం.

89A రిలీఫ్‌ కోసం 
ఫారిన్‌ రిటైర్మెంట్ బెనిఫిట్ అకౌంట్స్‌ నుంచి ఆర్జించే ఆదాయంపై పన్ను విషయంలో ఇండియన్‌ రెసిడెంట్స్‌కు రిలీఫ్‌ ఉంటుంది. దేశంలో ఐటీ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించే రిటైర్మెంట్ బెనిఫిట్ అకౌంట్‌ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును సెక్షన్ 89A అందిస్తుంది. ఈ తరహా ఉపశమనాన్ని క్లెయిమ్ చేయాలనుకుంటే, శాలరీ విభాగంలో వివరాలు ఇవ్వాలి.

ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ 
2022-23 ఆర్థిక సంవత్సరానికి ITR ఫామ్‌లో వచ్చిన మార్పుల్లో ఇది కూడా ఒకటి. ITR-3లోని బ్యాలెన్స్ షీట్‌లో ఈ తరహా ఆదాయాల గురించి అదనపు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు, SEBIలో రిజిస్టర్‌ అయిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారు (FII) లేదా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (FPI), SEBI రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇవ్వాలి.

ఇంట్రా-డే ట్రేడింగ్‌
కొత్త ITR ఫామ్ ప్రకారం, ఇంట్రా-డే ట్రేడింగ్ నుంచి టర్నోవర్ & ఆదాయ సమాచారాన్ని కొత్తగా తీసుకొచ్చిన 'ట్రేడింగ్ అకౌంట్‌' కింద సబ్మిట్‌ చేయాలి.

మరో ఆసక్తికర కథనం: బ్యాంకుల్లో చేరిన 76% నోట్లు, జనం దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

Published at : 04 Jul 2023 02:46 PM (IST) Tags: Income Tax ITR changes filing return forms

ఇవి కూడా చూడండి

Inherited Property: పెళ్లయిన కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందా, ఆస్తిని సమానంగా పంచి ఇవ్వాల్సిందేనా?

Inherited Property: పెళ్లయిన కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందా, ఆస్తిని సమానంగా పంచి ఇవ్వాల్సిందేనా?

Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్షన్‌ - నిరాశ చెందొద్దు, న్యాయం జరిగే దారుంది

Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్షన్‌ - నిరాశ చెందొద్దు, న్యాయం జరిగే దారుంది

Investment Tips 2025: కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయంతో మీ రిటైర్మెంట్‌ నాటికి రూ.కోట్ల కొద్దీ డబ్బు

Investment Tips 2025: కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయంతో మీ రిటైర్మెంట్‌ నాటికి రూ.కోట్ల కొద్దీ డబ్బు

UPI Circle Benefits: బ్యాంక్‌ ఖాతా, క్రెడిట్‌ కార్డ్‌ లేకపోయినా పేమెంట్స్‌ - యూపీఐ సర్కిల్‌తో చాలా లాభాలు

UPI Circle Benefits: బ్యాంక్‌ ఖాతా, క్రెడిట్‌ కార్డ్‌ లేకపోయినా పేమెంట్స్‌ - యూపీఐ సర్కిల్‌తో చాలా లాభాలు

Gold-Silver Prices Today 06 Jan: గోల్డ్‌ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 06 Jan: గోల్డ్‌ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు

HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం

HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం

Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!

Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!

HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే