By: ABP Desam | Updated at : 10 Jun 2023 08:38 AM (IST)
పన్ను ఆదా చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి
Income Tax Saving Documents: 2022-23 ఆర్థిక సంవత్సరానికి (AY 2023-24) ఆదాయ వివరాలతో IT రిటర్న్ ఫైల్ చేసే సీజన్ స్టార్టయింది, జులై 31 వరకు గడువు ఉంది. ఆదాయ పన్ను డిక్లరేషన్ సమయంలో పన్ను ఆదా చేయాలంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆడిటర్‌కు చూపడం తప్పనిసరి. మీరు ఏదైనా మార్గంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆయా పెట్టుబడులకు సంబంధించిన ధృవపత్రాలు ఇప్పటికీ మీ దగ్గర లేకపోతే, వాటిని సేకరించే పనిని వెంటనే ప్రారంభించండి. మీపై పన్ను బాధ్యత ఉంటుందా, లేదా?; ఒకవేళ పన్ను చెల్లించాల్సి వస్తే ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది అన్నది మీరు సేకరించే డాక్యుమెంట్ల ఆధారంగానే నిర్ణయమవుతుంది.
పన్ను ఆదా చేయడానికి సమర్పించాల్సిన పత్రాలు:
ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద, పన్ను చెల్లింపుదార్లు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా చేసుకోవచ్చు. యులిప్, లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్, మ్యూచువల్ ఫండ్, ELSS, PPF, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ 5 సంవత్సరాల పన్ను ఆదా పథకం, EPF, NPSలో పెట్టిన డబ్బుకు ఈ సెక్షన్ కింద కోసం మినహాయింపు లభిస్తుంది. ఇది కాకుండా, ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు, గృహ రుణం అసలు & వడ్డీ మీద కూడా పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.
మీరు ఈ పథకాలలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టినట్లయితే... వార్షిక పెట్టుబడి స్టేట్‌మెంట్ ఇవ్వమని మీ బీమా కంపెనీని, మ్యూచువల్ ఫండ్ కంపెనీని అడగండి. మీరు ఎడ్యుకేషన్ ఫీజు లేదా హోమ్ లోన్ ద్వారా పన్ను మినహాయింపు పొందాలనుకుంటే, వెంటనే ఆ ఖర్చులకు సంబంధించిన రసీదులు సేకరించండి. వాటిని సకాలంలో సమర్పిస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది.
గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు
గృహ రుణం విషయంలో... రూ. 2 లక్షల వరకు వడ్డీ మీద పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, మీరు మీ ఆదాయం నుంచి రూ. 2 లక్షల వరకు గృహ రుణ వడ్డీని తీసివేయవచ్చు. కానీ మీరు మీ టాక్స్ డిక్లరేషన్ ఫామ్‌లో ప్రకటించి, దాని ప్రూఫ్ సమర్పించినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనం దక్కుతుంది. ఈ పత్రం కోసం మీ బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవాలి. అందులో, ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు వడ్డీ చెల్లించినట్లు నమోదై ఉంటుంది. వడ్డీ రూపంలో రూ. 2 లక్షల కంటే ఎక్కువ చెల్లించినా, రూ. 2 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ప్రయోజనం పొందుతారు.
HRA క్లెయిమ్ కోసం పాన్ కార్డ్ అవసరం
ఇంటి అద్దె కోసం చెల్లించిన మొత్తం మీద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే, ఇంటి యజమానితో చేసుకున్న అద్దె ఒప్పందం లేదా అద్దె చెల్లింపు రసీదులను సమర్పించాలి. మీ వార్షిక అద్దె రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే, మీ ఇంటి యజమాని పాన్ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి.
మెడికల్ క్లెయిమ్‌కు సంబంధించిన పత్రాలు
ప్రతి సంవత్సరం రూ. 25,000 వరకు వైద్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. మీరు మెడికల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకున్నట్లయితే, రూ. 25,000 వార్షిక ప్రీమియం వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని కోసం మీ ఆరోగ్య బీమా కంపెనీ నుంచి ప్రీమియం చెల్లింపు స్టేట్‌మెంట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: ఎలాంటి బహుమతులపై ఇన్‌కం టాక్స్ కట్టక్కర్లేదు?
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ ఇవి, కానీ జాగ్రత్త!
Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?
Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024