By: ABP Desam | Updated at : 09 Jun 2023 11:26 AM (IST)
గిఫ్ట్‌గా తీసుకున్న ఆస్తులపై ఎంత ఆదాయ పన్ను కట్టాలి?
Income Tax Rules on Gifts: పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, ప్యూబర్టీ, పండుగలు, ఉత్సవాలు ఇలా ప్రతి సంతోషకరమైన సందర్భంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి ఆకర్షణీయమైన బహుమతులు అందుతుంటాయి. పేదవాడి నుంచి పెద్దవాడి వరకు, స్వీట్ల నుంచి స్వీట్ హోమ్స్ వరకు ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్లు గిఫ్ట్స్ ఇస్తుంటారు. అలాంటి సందర్భాల్లో, ఖరీదైన బహుమతులు తీసుకున్నప్పుడు వాటిపై ఆదాయ పన్ను కట్టాలా అన్న ప్రశ్న ప్రజల మనస్సుల్లో ఉంటుంది. భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చున్నప్పుడు, లేదా సొంత కుటుంబ సభ్యులకు బహుమతులు ఇచ్చినప్పుడు ఈ సంశయం మెదడును తొలిచేస్తుంది.
ఒక వ్యక్తి (Indivual) లేదా హిందు అవిభాజ్య కుటుంబం (HUF) స్వీకరించే బహుమతులపై వర్తించే పన్ను విషయంలో ఆదాయ పన్ను విభాగం కొన్ని నిబంధనలు (IT Rules on Gifts) రూపొందించింది. ఐటీ డిపార్ట్‌మెంట్ సర్క్యులర్ ప్రకారం, వేడుకల సందర్భంగా ఒక వ్యక్తి స్వీకరించిన నగదు లేదా చరాస్తి లేదా స్థిరాస్తిని బహుమతిగా పరిగణిస్తారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బహుమతుల రూపంలో పొందే చరాస్తులు, స్థిరాస్తులు ఈ వర్గంలోకి వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటిన బహుమతి మొత్తం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది.
అయితే.., కుటుంబ సభ్యుడు లేదా సమీప బంధువు చర లేదా స్థిరాస్తిని బహుమతిగా ఇస్తే, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉన్నా దానిపై ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆదాయ పన్ను రూల్స్ ప్రకారం, కుటుంబ సభ్యుడు లేదా సమీప బంధువు అంటే ఎవరు?
బహుమతి అందుకున్న వ్యక్తి జీవిత భాగస్వామి. అంటే, భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటే దానిపై పన్ను వర్తించదు.
బహుమతి అందుకున్న వ్యక్తి సోదరుడు లేదా సోదరి. అంటే, తోడబుట్టినవాళ్లు బహుమతులు ఇస్తే దానిపై ఆదాయ పన్ను కట్టక్కర్లేదు.
బహుమతి అందుకున్న వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరికైనా సోదరుడు లేదా సోదరి. అంటే, మేనత్త లేదా మేనమామ నుంచి వచ్చే బహుమతులపై పన్ను పడదు.
బహుమతి అందుకున్న వ్యక్తి జీవిత భాగస్వామికి సోదరుడు లేదా సోదరి. అంటే, భార్య లేదా భర్తకు తోడబుట్టినవాళ్లు. వీళ్లు ఇచ్చే బహుమతిలపైనా పన్ను కట్టక్కర్లేదు.
భార్యాభర్తల వారసులు కూడా ఏదైనా బహుమతి ఇస్తే, దానిపై పన్ను విధించరు.
సందర్భాన్ని బట్టి పన్ను తీరు మారుతుంది
ఒక వ్యక్తికి. తన వివాహం సందర్భంగా వచ్చే బహుమతులపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయ పన్ను నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే, పెళ్లి సందర్భం కాకుండా వేరే సందర్భంలో బహుమతులు తీసుకుంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో అలాంటి బహుమతుల విలువ రూ. 50,000 దాటితే పన్ను చెల్లించాలి. అంటే, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం సహా ఇతర సమయాల్లో అందుకున్న బహుమతులపై పన్ను కట్టాల్సి ఉంటుందని ఆదాయ పన్ను విభాగం తన సర్క్యులర్‌లో పేర్కొంది.
మరో ఆసక్తికర కథనం: ఫ్లాట్.. ఫ్లాట్.. ఫ్లాట్! స్వల్ప నష్టాల్లో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీ
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?