By: ABP Desam | Updated at : 09 Jun 2023 10:44 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్‌డేట్ ( Image Source : Pixabay )
Stock Market Opening 09 June 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగెటివ్ సిగ్నల్స్ అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 13 పాయింట్లు తగ్గి 18,619 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 26 పాయింట్లు తగ్గి 62,814 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,848 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,810 వద్ద మొదలైంది. 62,760 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,992 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 26 పాయింట్ల నష్టంతో 62,814 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,634 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,655 వద్ద ఓపెనైంది. 18,609 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,676 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 13 పాయింట్లు తగ్గి 18,619 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,045 వద్ద మొదలైంది. 43,932 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,220 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 124 పాయింట్లు పెరిగి 44,119 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సెమ్, గ్రాసిమ్, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, హిందుస్థాన్ యునీలివర్, ఇన్ఫీ, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.430 పెరిగి రూ.60,650గా ఉంది. కిలో వెండి రూ.1100 పెరిగి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 తగ్గి రూ.26,910 వద్ద ఉంది.
Also Read: ₹2,000 Notes: మార్కెట్ నుంచి సగం పింక్ నోట్లు మాయం, ₹500 నోట్లపై కీ అప్‌డేట్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations to PTC Industries Limited on getting listed on NSE today.#NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #BellRinging #NSEBell #PTCIndustries @ashishchauhan pic.twitter.com/iStElctXyJ
— NSE India (@NSEIndia) June 9, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) June 8, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/Czx2KbEnd3
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్