By: ABP Desam | Updated at : 15 Jun 2023 05:11 PM (IST)
పాన్-ఆధార్ లింకింగ్‌పై IT డిపార్ట్‌మెంట్ ట్వీట్
Aadhar-PAN Linking: మీరు మీ ఆధార్ కార్డ్‌ను, పాన్ కార్డ్‌తో లింక్ చేశారా, లేదా?. లింక్ చేయకుంటే, ఆ పనిని ఈ నెలాఖరు కల్లా (30 జూన్ 2023) కచ్చితంగా పూర్తి చేయండి. ఎందుకంటే, 'కేవలం' రూ. 1,000 జరిమానా చెల్లించి పాన్-ఆధార్‌ను లింక్ చేయడానికి జూన్ 30 చివరి తేదీ. 'కేవలం' అని ఎందుకు చెప్పామంటే, జూన్ 30 తర్వాత రూ. 10 వేలు ఫైన్ కట్టాల్సిరావచ్చు. కాబట్టి, గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకోవద్దు.
జూన్ 30 లోపు పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయాలని ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ ద్వారా ప్రజలకు సూచించింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు పొందిన కేటగిరీలోకి రాని పాన్ హోల్డర్లందరూ జూన్ 30, 2023లోపు ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఆలస్యం చేయకుండా ఈ రోజే పాన్-ఆధార్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను విభాగం విజ్ఞప్తి చేసింది.
Kind attention PAN holders!
— Income Tax India (@IncomeTaxIndia) June 13, 2023
As per Income-tax Act, 1961, it is mandatory for all PAN holders, who do not fall under the exempt category, to link their PAN with Aadhaar on or before 30.06.2023.
Please link your PAN & Aadhaar today!#PANAadhaarLinking pic.twitter.com/hBxtSgRci8
30 జూన్ 2023లోపు పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, అప్పుడు పాన్ కార్డ్ నాన్-ఆపరేటివ్ అవుతుంది. ఆ తర్వాత అధిక జరిమానాను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు.. పాన్-ఆధార్ లింక్ కాకపోతే, పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్ ఉండదు. పాన్ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అలాగే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ TDS & TCS వసూలు చేస్తారు.
పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు, వాటిని అనుసంధానించాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్టం ప్రకారం నాన్ రెసిడెంట్‌లు, భారతీయ పౌరులు కాని వారు, గత సంవత్సరం నాటికి 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.
పాన్‌తో ఆధార్ ఎందుకు లింక్ చేయాలి?
పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, ఆర్థికపరమైన లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంక్ అకౌంట్, డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. పాన్ కార్డ్ అవసరమైన ప్రతి పనీ ఆగిపోతుంది. కాబట్టి, పాన్-ఆధార్ లింకింగ్‌ను త్వరగా పూర్తి చేయండి.
ఆధార్-పాన్‌ను ఎలా లింక్ చేయాలి?
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ను ఓపెన్ చేయండి.
ఈ వెబ్‌సైట్‌లో (ఇప్పటికీ చేయకపోతే) రిజిస్టర్ చేయసుకోండి.
మీ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) మీ యూజర్ ID అవుతుంది.
యూజర్ ID, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
పాప్ అప్ విండో తెరుచుకోకపోతే, మెనూ బార్‌లోని 'ప్రొఫైల్ సెట్టింగ్స్'లోకి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
పాన్ కార్డ్‌లో ఉన్న ప్రకారం మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సరిచూసుకోండి.
వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, "లింక్ నౌ" బటన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ మీ పాన్‌తో విజయవంతంగా లింక్ అయిందన్న పాప్-అప్ మెసేజ్ మీకు తెలియజేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ప్రభుత్వ బ్యాంక్స్ Vs ప్రైవేట్ బ్యాంక్స్ - ఏది లాభసాటి బేరం?
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?