By: Arun Kumar Veera | Updated at : 09 Feb 2024 03:05 PM (IST)
టాక్స్ టైమ్‌లో జనం కామన్‌గా చేస్తున్న తప్పులివి
Income Tax Return Filing 2024 Common Mistakes: ఆదాయ పన్ను బాధ్యతను ప్రకటించే సమయంలో (ITR ఫైలింగ్ సమయంలో) కొంతమంది పొరపాట్లు చేస్తున్నారు. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు చిన్న నిర్లక్ష్యం/తప్పు/పొరపాటుకు అస్సలు తావుండకూడదు. లేదంటే, చిన్న పొరపాటు కారణంగానూ ఐటీ నోటీస్ అందుకునే ప్రమాదం ఉంటుంది.
ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఎక్కువ మంది విషయంలో ఒకే రకమైన తప్పులు (Common Mistakes While Filing ITR) చేస్తున్నారు. అవి:
1. సరైన ITR ఫామ్‌ను ఎంచుకోకపోవడం
ఒక వ్యక్తి సంపాదన, మొత్తం ఆదాయం, పన్ను విధించదగిన ఆదాయం ఆధారంగా ఆదాయపు పన్ను ఫారం ఎంచుకోవాలి. ITR-1 నుంచి ITR-4 వరకు ఉన్న ఫామ్స్‌ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్ల (Individual taxpayers) కోసం నిర్దేశించారు. మీ ఆదాయం సంవత్సరానికి 50 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే, మీరు ఆదాయపు పన్ను ఫారం-1ని ఎంచుకోవాలి. బ్యాంక్ ఎఫ్‌డీలు, ఇతర పెట్టుబడుల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నా ఇదే ఫారం ఫైల్ చేయాలి. తప్పుడు ఫారాన్ని ఆదాయ పన్ను విభాగం స్వీకరించదు. 15 రోజుల లోపు మళ్లీ సరైన ఫారం పూర్తి చేసి, సమర్పించాలి. మరోవైపు, పదేపదే తప్పులు చేస్తే IT నోటీసును, పెనాల్టీని భరించాల్సి వస్తుంది.
2. వడ్డీ ఆదాయాలు వెల్లడించకపోవడం
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు, చాలా మంది పన్ను చెల్లింపుదార్లు చేసే కామన్ మిస్టేక్ ఇది. బ్యాంకులు & పోస్టాఫీసుల్లో పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం గురించి సమాచారం ఇవ్వడం మర్చిపోతుంటారు. ఈ తప్పు చేయకూడదనుకుంటే, ఫారం సమర్పించే ముందే ఫామ్-26AS (Form-26AS) & AISను (Annual Information Statement) క్రాస్-చెక్ చేయాలి.
3. ఫామ్-16, ఫామ్-26AS తనిఖీ చేయకపోవడం
ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ముందు, తప్పనిసరిగా ఫామ్-26AS, AISను తనిఖీ చేయాలి. ఇందులో, TDS గురించి పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత, దానిని ఫామ్-16తో (Form-16) సరిపోల్చాలి. ఈ రెండు ఫారాల్లో TDS సంబంధిత తప్పు లేదా వైరుధ్యం కనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
4. పాత సంస్థ నుంచి వచ్చిన ఆదాయం
ఒకవేళ, ఒక వ్యక్తి ఉద్యోగం మారిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి వస్తే కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2023 ఏప్రిల్ 1 - 2024 మార్చి 31 మధ్య కాలంలో) ఉద్యోగం/ఉద్యోగాలు మారితే... ప్రస్తుత కంపెనీతో పాటు, పాత కంపెనీ నుంచి కూడా ఫామ్-16 తీసుకోవాలి. దీనివల్ల, పాత ఉద్యోగం & TDS గురించి సమాచారం లభిస్తుంది. అప్పుడు IT డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వంటి సమస్యల బారిన పడరు.
5. మూలధన లాభాలు చెప్పకపోవడం
షేర్లు, మ్యూచువల్ ఫండ్, బంగారం వంటి వాటి ద్వారా ఆర్జించిన లాభాలను మూలధన లాభాలుగా (Capital gains) పిలుస్తారు. ఆస్తి రకాన్ని బట్టి వీటిపై 15% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ సమర్పించే సమయంలో ఇలాంటి ఆదాయానికి సంబంధించిన సమాచారం వెల్లడించాలి. దీర్ఘకాలిక మూలధన లాభాల మీద 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
6. బ్యాంక్ వివరాలు తప్పుగా ఇవ్వడం
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు బ్యాంకు వివరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు, ప్రజలు బ్యాంకు వివరాలను సరిగ్గా నింపరు. బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSCలో ఒక్క అంకెను తేడాగా నింపినా మీకు రావలసిన ప్రయోజనాలు ఆగిపోతాయి. పైగా, ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ అందుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.
7. చివరి నిమిషంలో ITR దాఖలు
కొంతమంది ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన చివరి తేదీ వరకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు, ఆఖరి రోజున హడావిడి చేస్తారు. అలాంటి పరిస్థితిలో, తొందరపాటు కారణంగా తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ముఖ్యమైన సమాచారాన్ని మర్చిపోవడం జరగొచ్చు. ఈ కారణంగా ఆదాయ పన్ను నోటీసును ఎదుర్కోవలసి రావచ్చు. ఎలాంటి సమస్య లేకుండా సౌకర్యవంతంగా పని పూర్తి కావాలంటే, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయవద్దు.
మరో ఆసక్తికర కథనం:
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత